Tuesday, July 8, 2025
spot_img

ఏపీఎల్ లో ఘన విజయం సాధించిన రాయలసీమ కింగ్స్‌

Must Read

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) లో రాయలసీమ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.ఓపెనర్లు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక్క వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేశారు.వంశీకృష్ణ 35 బంతుల్లో 57 పరుగులు తీశారు.కింగ్స్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధసెంచరీ చేసిన వంశీ రనౌట్‌ అయి వెనుదిరిగాడు.ఆ తర్వాత ప్రసాద్‌(16 బంతుల్లో 21), శశికాంత్‌(19 బంతుల్లో 36) రాణించడంతో టైటాన్స్‌ మంచి స్కోరును సాధించింది.గిరినాథ్‌రెడ్డి, సత్యరాజు రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.తర్వాత బ్యాటింగ్ కి దిగిన రాయలసీమ కింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ హనీశ్‌రెడ్డి వికెట్‌ కోల్పోయింది.ప్రశాంత్‌కుమార్‌, రోషన్‌కుమార్‌(17 బంతుల్లో 39) ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.గుట్టా రోహిత్‌(47 బంతుల్లో 70), రోషన్‌కుమార్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 71 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌తో జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. కింగ్స్‌తో పోరులో టైటాన్స్‌ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.కింగ్స్‌ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.టైటాన్స్‌ బౌలర్లు కేవలం మూడు వికెట్లు పడగొట్టి నిరాశపరిచారు.ఈనెల 7న ఉత్తరాంధ్ర లయన్స్‌తో రాయలసీమ కింగ్స్‌ తమ తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS