ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం సంక్షోభానికి గురైందని అధికారులు వెల్లడించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని,నిర్మాణ రంగం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.మరోవైపు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు.ఇదే తరుణంలో కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకోని రావాలని చంద్రబాబు భావించినట్టు తెలుస్తుంది.