Friday, September 20, 2024
spot_img

డీఎస్ శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం రేవంత్

Must Read
  • గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్
  • ఉదయం 3:30 గంటలకు కన్నుమూత
  • ట్విటర్ ద్వారా వెల్లడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
  • డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించిన సీఎం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.శనివారం ఉదయం 3:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు ధర్మపురి అరవింద్ తెలిపారు.గతకొంత కాలంగా ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
తండ్రి మరణం పై కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్ చేశారు.”ఏ ఆపద వచ్చిన ఆదుకునే శ్రీనన్న,ఇక లేరని” తెలిపారు.”ఐ విల్ మిస్ యు డ్యాడ్”,”నా గురువు మా నాన్నే..!! ఎదురెళ్లి పోరాడు,భయపడకు అని నేర్పింది మా నాన్నే”అంటూ ఎక్స్ లో ట్విట్ చేశారు. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే..!! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.శ్రీనివాస్ గతంలో పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని,సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలను అందించారని గుర్తుచేశారు.చిన్నస్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయంలో ఎందరికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో,కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో డీఎస్ ప్రత్యేక ముద్రను చాటుకున్నారని తెలిపారు.అయిన ఎటిఎం,ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు.

ఆదివారం నిజామాబాద్ లో డీఎస్ అంతక్రియలు జరగనున్నాయి.అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించాలని,అంతక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలనీ సీఎస్ శాంతికుమారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This