తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ చేయాలని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని..పౌష్టికాహారం అందించేందుకు డైట్ చార్జీలను పెంచామని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.