అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్ పాండే,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనంద్ కుమార్ దుబే,అసిస్టెంట్ ఇంజినీర్ రాజేంద్ర కుమార్ యాదవ్,జూనియర్ ఇంజినీర్ మహమ్మద్ షాహిద్ లపై సస్పెన్షన్ వేటు పడింది.గుంతలు పడ్డ రహదారులను వెంటనే రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు.ఇక నుండి అయోధ్య లో ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.