సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభకు అయిన హాజరుకానున్నారు. కాళోజీ కళాక్షేత్రం సహ పలు అభివృద్ది పనులకు ప్రారంభిస్తారు. హన్మకొండ, వరంగల్, కాజీపేటల అభివృద్దికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 4962. 47 కోట్లు కేటాయించింది.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1500 మందికికి పైగా పోలీసులు బందోబస్తులో ఉంటారని అధికారులు తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్, సీఎం కాన్వాయి ప్రయాణించే మార్గంలో ఎస్బీ, ఇంటిలిజెన్స్, స్థానిక పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు ఉదయం 09 గంటల నుండి సాయింత్రం మీటింగ్ ముగిసేంత వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.