వైద్యో నారాయణ హరి అన్న మాట నిజమే..కానీ కార్పొరేట్ ఆసుపత్రుల,రోగాల బారిన పడ్డ వారిని జలగల్లా పట్టి పిడుస్తున్నారు..నొప్పి జ్వరం,ఏ రోగంతో అయిన హాస్పిటల్ మెట్లు ఎక్కమంటే
గుండె గుబెలే..వ్యాధి నిర్ధారణ చేయకుండానే అనవసర టెస్టుల పేరుతో రోగికి టెన్షన్ పెట్టిస్తూ లక్షలాది రూపాయులు గుంజి
పెద్ద పెద్ద భవంతులు కడుతూ..సామాన్య జనాన్ని పీక్కు తింటున్నారు.సందట్లో సడేమియా లాగా నకిలీ డాక్టర్లు రాజ్య మేలు
తూ ఆచ్చి రానీ వైద్యం చేసి రోగుల ప్రాణాలు తీస్తున్న సందర్భాలు ఎన్నో..పెద్ద రోగాన్ని సైతం చిన్న మాత్రతో తగ్గించే పాత
రోజులే బెటర్..వైద్యం వ్యాపారంగా మారి సామాన్యుల బలి అవుతున్నారు.సమాన్యుడికి ఖర్చు లేని కార్పొరేట్ వైద్యం
అందినప్పుడే ఆరోగ్య సమాజం ఏర్పడినట్టు లెక్క
- కామిడీ సతీష్ రెడ్డి