Thursday, November 21, 2024
spot_img

నాడు బిఆర్ఎస్ లో కల్వర్టు కబ్జా,నేడు కాంగ్రెస్ లో రోడ్డు కబ్జా…!

Must Read
  • అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా.?
  • బోడుప్పల్ మున్సిపల్ లో కోట్ల విలువైన ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డు స్థలాలు కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్త ..!
  • కబ్జాలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన‌ మాజీ మేయర్ కుమారుడు
    సామల మనోహర్ రెడ్డి
  • ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలోగ్గి ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు.
  • నాడు కల్వర్టును,నేడు రోడ్డును కబ్జా చేసిన కార్పొరేటర్ భర్త పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ప్రజా ఆస్థులను పరిరక్షించాలని
    కోరుతున్న కార్పొరేషన్ ప్రజలు.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వర్టును కబ్జా చేయగా…నేడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి రోడ్డును కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్తపై ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ యువ నేత సామల మనోహర్ రెడ్డి. అధికార పార్టీలో ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార బలంతో రోడ్డుని కబ్జా చేసి రేకుల షెడ్లు వేశారు. తన అధికార బలం ఉపయోగించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ భర్తపై పిర్యాదు చేయ్యాడానికి కాలనీవాసులు భయపడటంతో బీఆర్ ఎస్ యువజన నాయకులు సామల మనోహర్ రెడ్డి స్పందించి ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డును కబ్జా చేయడం ఏమిటని వెంటనే ఫిర్యాదు చేయగా, అధికార పార్టీకి తలొగ్గిన మునిసిపల్ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించవలసిన ప్రజా ప్రతినిధి భర్త కబ్జాలు చేస్తూ పోతే నిమ్మకు నీరెత్తినట్టు మున్సిపల్ అధికారులు వ్యవహరించడం అమ్యామ్యాలకు దాసోహం అయ్యారని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సర్వే నెంబరు 6,7,8 మణికంఠ నగర్ చివరలో ఉన్న రోడ్డుపై కన్నెసిన కార్పోరేటర్ భర్త అదును చూసి గుట్టుచప్పడు కాకుండా రేకుల షేడ్డు వేసి కోట్లు విలువ చేసే రోడ్డు స్థలాన్ని కబ్జా చేసాడు.ప్రజా ఆస్తులను పరిరక్షించవలసిన ప్రజాప్రతినిధులే తన కుటుంబ సభ్యులతో కబ్జాలు చేస్తుంటే సామాన్యుని పరిస్థితి ఏంటని ప్రజలు అనుకుంటున్నారు. సామాన్యుడు తన సొంత స్థలంలోనే చిన్న గుడిసె వేసుకుంటే కూల్చివేసే మున్సిపల్ అధికారులు, అధికార బలంతో ప్రజాప్రతినిధి భర్త కోట్ల విలువ చేసే వందల గజాలను కబ్జా చేసి ఏకంగా నిర్మాణమే చేశాడంటే బోడుప్పల్లో అధికార పార్టీకి అధికారులు ఎలా తలోగ్గారో రోడ్డు కబ్జాయే నిదర్శనం.ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అక్కడ కార్పొరేటర్ భర్త రోడ్డుని ఆక్రమించి కట్టింది నిజమైనని…. మలమూత్రాలు చెత్తా-చెదారం వేస్తూ వాసనలు వస్తున్నాయని ఉద్దేశంతోటే ఓ షెడ్ ను నిర్మించారని అధికారులు ఏకంగా కార్పొరేటర్ భర్త కు సపోర్టుగా మాట్లాడటంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలు మొదలాయ్యాయని చెప్పడానికి నిదర్శనం అని తెలుస్తున్నాయి.. నాపై ఎవడు కంప్లైంట్ ఇచ్చాడో వాడు వచ్చి నా ఇంటి ముందు కాపలా ఉంటాడా అని చెప్పి కబ్జా చేశాను …ఏం చేసుకుంటారో చేసుకోమనడంలోనే కాంగ్రెస్ పార్టీ హాయంలో ఇలాంటి కబ్జాలు జరుగుతాయనడానికి నిదర్శనమే బోడుప్పల్ లో రోడ్డు కబ్జా.

గతంలో ఉన్నటువంటి చాకలోళ్ల గండీ ఉంటే కాలనీలు నీటమునుగునా..!
ఆనాటి చాకలోళ్ల గండి ఏమైపోయే..?

గతంలో వచ్చిన భారీ వర్షాలకు ఎస్ బి ఆర్ కాలనీ,బిఎల్ఆర్ కాలనీ,శ్రీ సాయి ఎంక్లేవ్ మనసాని కాలనీలతోపాటు మరికొన్ని కాలనీలు నీట మునగడానికి ప్రధాన కారణం చాకలోళ్ల గండీ కబ్జా చేయడమే. బోడుప్పల్ గ్రామ పెద్దలు భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్కర పరిస్థితులు వస్తాయనే ముందుచూపుతో చాకలోళ్ల మన్యాల దగ్గర వరద నీరుపోవడానికి గండి పెడితే నేడు స్వార్ధ రాజకీయ నాయకుల చేతిలో మాయమై పోయింది.గత వర్షాలకు నీట మునిగిన బోడుప్పల్ మున్సిపల్ లోని పలు కాలనీలను పర్యవేక్షించిన అప్పటి జిల్లా కలెక్టర్ కు చాకలోని గండి కబ్జా చేసి అమృత బార్ నిర్మించారని స్థానికులు పిర్యాదు చేయగా,తక్షణమే అమృత బార్ ను కూల్చాలని అదేశించారు. కానీ అప్పటి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి అండదండలతో కలెక్టర్ ఆదేశాలు ఆనాటి వరద నీటిలో కలిసిపోయాయి. కానీ కార్పోరేటర్ ఎలాంటి చర్యలు లేనందున నేడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి దాన్ని ఆసరాగా చేసుకున్న కార్పొరేటర్ భర్త నేడు ప్రస్తుతం దాని వెనుక భాగంలో ఉన్నటువంటి రోడ్డుని కబ్జా చేసి ఓ రేకుల షెడ్డు వేసాడు.దాని విలువ ప్రస్తుతం కోట్లలో ఉంటుందని బహటంగానే చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వాస్థులను కబ్జా చేస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం :మున్సిపల్ కమిషనర్…బోడుప్పల్

అమృత బార్ వెనకాల ఉన్న రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందని,అక్రమార్కులు ఏ స్థాయిలో ఉన్నా ఫిర్యాదులపై సరైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS