ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ – పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతుండడంతో ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు.ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.