మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారు.మరోవైపు హరీష్ రావు నివాసం లోపలికి వెళ్లేందుకు సునీత లక్ష్మ రెడ్డి,మాజీ ఎంపీ మాలోతు కవిత ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వారు అక్కడే బైఠాయించారు.మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అరెకపూడి గాంధీ,కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం పై హరీష్ రావు స్పందించారు.బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ,వారి అనుచరులను అరెస్ట్ చేయాలని అన్నారు.అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.