Friday, November 22, 2024
spot_img

ఫ్రీడమ్ ఫైటర్ అంటూ,ఫ్రీగా కొట్టేశారు

Must Read
  • నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
  • అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్
  • బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు
  • సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం
  • బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు
  • రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం
  • అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్

దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు మంచి అవకాశాలు కల్పిస్తాయి. అలాగే సమాజం కొంత గౌరవం ఇస్తుంది. కానీ ఇదే అదునుగా తీసుకొని కొందరూ మిస్ యూజ్ చేసుకుంటున్నారు. ఇదే తరహాలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఫ్రీడమ్ ఫైటర్ అనే పేరు చెప్పి ఓ కుటుంబం పెద్ద మోసానికి పాల్పడింది. తన భర్త ఫ్రీడమ్ ఫైటర్ అని తనకు ఎలాంటి ఆధారం లేదు ప్రభుత్వం ఇళ్లు స్థలాన్ని కేటాయించాలని దరఖాస్తు చేసుకొంది. వాస్తవానికి ఆమె భర్త ఫ్రీడర్ ఫైటర్ కానేకాదని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. కానీ ఎలాంటి అర్హతలు, ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకున్నా అక్రమ మార్గంలో గవర్నమెంట్ ల్యాండ్ కొట్టేసింది. తమ భూమికి సంబంధించిన పాసుపుస్తకం జారీ కావట్లేదని, రేషన్ కార్డు కావాలని, పెన్షన్ తొలగించారంటూ నెలల తరబడి సర్కారు ఆఫీసుల చుట్టూ ఎండ్ల త‌ర‌బ‌డి తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న నెలన్నర లోపే ఆమెకు ప్రభుత్వం జాగ చూపించడం ఆ వెంటనే అలాట్మెంట్ చేయడం టకాటకా జరిగిపోయింది.

ఇదీ అందరికీ సాధ్యం కాదు. ఎవరో పెద్ద తలకాయ సపోర్ట్ ఉంటే తప్ప. అదీ కూడా వాళ్లకు దగ్గరగా ఉన్నవాళ్లకే మేలు జరుగుతుంది. అయితే సంగారెడ్డిలో ఓ ప్రముఖ పత్రికకు, ఛానల్ కి రిపోర్టర్ గా పని చేసిన వ్యక్తికి లాభం చేకూరింది. అదేలాగో అంటే వాళ్ల గవర్నమెంట్ కు పూర్తిగా సహకరించినందుకో, ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చూసిచూడనట్టు ఉంటూ పరోక్షంగా ఉన్నందుకో, లేదా స్వామీ భక్తి ప్రదర్శించినందుకో ఏమోగానీ అమీన్ పూర్ లోని సర్వే నంబర్ 462 సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలోని 300 గ‌జాల స్థ‌లాన్ని రాసిచ్చారు. రహదారిపక్కన కమర్షియల్ బిట్ లో దాదాపు రూ. 4 కోట్లు విలువ చేసే 300 గజాలను తాత ఫ్రీడమ్ ఫైటర్ అంటూ అప్పనంగా అప్పగించేశారు అధికారులు. దానికి సంబంధించి గవర్నమెంట్ రూల్స్ కూడా ఫాలో అవ్వలేదు. వాస్తవానికి డ‌బ్ల్యూఏ నెం. 855/2019 ప్రకారం వరంగల్ కి చెందిన ఎవ్వరు లేని ఫ్రిడమ్ ఫైటర్ భార్యకు 300 గజాలు ఇవ్వాల్సిందిగా నాడు కోర్టు తీర్పు వెలువరించింది. అయితే జీ.వో. నెంబర్ 185, తేది: 11-03-1997 న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎవ్వరు లేనందున ఆమెకు 300 గజాలు 30 రోజుల్లో గతంలో అలాట్మెంట్ చేసిన భూమిని అప్పగించాలని డివిజన్ బెంచ్ 2022 లో తీర్పు ఇవ్వడం జరిగింది. విలేఖరిగా పనిచేస్తున్న ఇతను అదే కోర్టు తీర్పు సాకుతో తన తాత ప్రీడమ్ ఫైటర్ అని .. నానమ్మకి ప్లాట్ కావాలంటూ అప్ప‌టి బీఆర్ఎస్ మాజీ మంత్రితో దగ్గర ప్రపోజల్ పెట్టాడు. ఇంకెందుకు ఆలస్యం అంటూ ట్రబుల్ షూటర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి 45రోజులలోపే భూమి రాసిచ్చారు.

మంత్రి గారి యవ్వారం బట్టబయలు

‘ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి’ అంటూ పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు. అట్లానే అయింది మాజీ మంత్రిగారి పరిస్థితి. అధికారం ఉంటే తనా అనుకున్న వారికి ఎలా మేలు చేయవచ్చు అని నిరూపించారు ట్రబుల్ షూటర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన కుటుంబానిదే హవా నడిసింది. తెలంగాణ వచ్చిందే వాళ్లకోసమేమో అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. వందలాది మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పాటు అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వాళ్ల ఇంటోళ్లు ఒక్కలే కోట్లాడి తమకోసం తెచ్చుకున్నట్టు పదేళ్లు రాష్ట్రం మీదపడి మెక్కారని అనేక మంది బహిరంగంగానే తిట్టడం చూశాము. వాళ్ల హయాంలో ధరణి అనే ఓ పోర్టల్ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, పేద, అమాయక ప్రజల జాగలను అప్పనంగా లాగేసుకున్నారు. దశబ్ధాల కాలం నాటి రికార్డులను మాయం చేసి లక్షల ఎకరాలు కొట్టేశారు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో కోట్లాది రూపాయల విలువైన భూమిని ఓ ఫ్రీడమ్ ఫైటర్ పేరుతో డ్రామా ఆడి 300 గ‌జాల భూమిని కొట్టేశారు. జాతీయ రహదారి పక్కనే గల ఈ జాగను ప్లాన్ చేసి కొట్టేయడం వెనుక అప్పటి మంత్రి ఉన్నట్లు తేలిపోయింది.

కోట్లాది రూపాయల భూమి ఎలా కేటాయిస్తారు:

అసలు అర్హత లేకుండానే ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి అతని భార్య పేరుమీద భూమి దానం చేయడం ప్రశ్నలకు తావిస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన కొలిశెట్టి వజ్రమ్మ చేత ఇంటి స్థలం కావాలంటూ నవంబర్ 22, 2022న దరఖాస్తు చేయించారు. దొంగ రూట్లో కేవలం 44 రోజులలో 300 గజాల ప్రభుత్వ భూమిని కేటాయింపు చేశారు. వడ్డించే వాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్న ముక్కలు బాగానే పడతాయి అన్నట్టు… ఇంత త్వరితగతిన ఫైల్ మూవ్ అయ్యిందంటే అధికారులు జెట్ స్పీడ్ లో పనిచేసి పెట్టారో అర్థం చేసుకోవచ్చు. 05-01-2023న అప్ప‌టి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమీన్ పూర్ తహశీల్దార్ కి ఫ్రీడమ్ ఫైటర్ క్యాటగిరీ కింద వజ్రమ్మకు భూ కేటాయింపు చేయాలని లేఖ రాయడం, కలెక్టర్ లేఖ రాసిన వెనువెంటనే నాలుగు రోజుల్లోనే అనగా 09-01-2023న ముగ్గురు వీఆర్ఏలు వచ్చి ప్రభుత్వ భూమి 462 సర్వే నెంబర్ లో ఉంది అంటూ.. రోడ్డు లేకుండానే మరో ఉత్తరం వైపు 25 ఫీట్ల రోడ్డుని ఇచ్చేస్తారు. 100 ఫీట్ల రోడ్డుకు 60ఫీట్లు వచ్చేలా కొలిసి వారికి ఇష్టం అయిన భూమిని కేటాయింపు చేశారు. మ‌రుస‌టి రోజే ఎమ్మార్వో కలెక్టర్ కి లేటర్ పంపించిన వారం రోజుల్లోనే కొలిశెట్టి వజ్రమ్మ తేదీ 18 జనవరి 2023 మ‌ర‌ణించింది.దీంతో అమెకు ఇద్దరూ కుమారులు, ఒక్క కూతురు ఉండేది. కానీ ఆ స్థ‌లాన్ని ఎలాంటి ప్రోసిడింగ్ లేకుండా వ‌జ్ర‌మ్మ పెద్ద‌కుమారుడు కొలిశెట్టి యాద‌గిరి రావుకు కేటాయించారు.ఒక్కరికే ఎమ్మార్వో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం. సూర్యాపేట లో చనిపోతే సంగారెడ్డి ఎమ్మార్వో ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.అసలు ఎమ్మార్వోకి ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ఫ్యామిలీ మెంబ‌ర్ స‌ర్టిఫికేట్ జారీ చేసే అధికారం ఉన్నదా? చట్టపకారం అర్హత లేకుండా ఎమ్మార్వో లీగలేరు సర్టిఫికెట్ ఎలా జారీ చేశారు అనే చర్చ అమీర్ పూర్ మండలం హాట్ హాట్ గా నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భూబాగోతంపై ప్రస్తుత సర్కారు దృష్టిసారించాలని.. దీని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇదే విష‌యంపై అమీన్‌పూర్ మండ‌లం ఆర్డీవో, డిప్యూటీ త‌హ‌సీల్దార్ వివ‌ర‌ణ కోర‌గా స్పందించ‌డం లేదు.. స‌ర్వే నెంబ‌ర్ 462లో ఉన్న 3 ఎక‌రాల భూమిలో అక్ర‌మంగా నిరుపేద‌ల‌కు 8మందికి కేటాయింపులో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, ఫ్రీడం పైట‌ర్‌కు స్థ‌ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చ‌ర్య‌ల‌కు ఆదేశించిన, ప‌ట్టించుకోని అధికారుల‌పై,అక్ర‌మ కేటాయింపుపై మున్సిప‌ల్ అధికారులు ఇచ్చిన అనుమ‌తుల‌పై పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం..అవినీతిపై అస్త్రం..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS