ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు.ఉపేంద్ర ద్వివేది ఇప్పటివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పని చేశారు.2022 మే నుంచి ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ పండే పదవీ విరమణ చేయడంతో అయిన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ని నియమించారు.పరమ విశిష్ట సేవా పతకం,అతి విశిష్ట సేవా పతకం,మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్ కమెండేషన్ కార్డ్‌లతో పాటు మరెన్నో పతకాలను ఉపేంద్ర ద్వివేది అందుకున్నారు.మధ్యప్రదేశ్ కి చెందిన ఉపేంద్ర ద్వివేది సైనిక్ స్కూల్ లో చదివారు.ఆ తరువాత 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరి 1984 లో జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ కి చెందిన 18వ బెటాలియన్ లోకి అడుగుపెట్టారు. కాశ్మీర్ లోయ,రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో కూడా పనిచేశారు.అస్సాం రైఫిల్స్ లో కమాండర్ గా ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో విశేష సేవలు అందించారు.ఇండియన్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఉపేంద్ర ద్వివేదికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.