నిరుద్యోగులకు ఎస్.ఎస్.సి శుభవార్త అందించింది.కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8326 ఎం.టీ.ఎస్,హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.దేశంలో గుర్తింపు పొందిన వివిధ బోర్డుల నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు.ఇంగ్లీష్ తో పాటు తెలుగు,ఉర్దూ భాషల్లో కూడా ఈ పరీక్ష రాయవచ్చు.మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ లో 4887ఖాళీలు,హవల్దార్ (గ్రూప్ సీ నాన్ మినిస్టీరియల్)- 3439 ఖాళీలు ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే వారు 2024, ఆగస్టు 1 నాటికి 18- 25 ఏండ్లు,హవల్దార్ పోస్టులకు 18- 27 ఏండ్ల మధ్య జన్మించి ఉండాలని తెలిపింది.ఎస్సీ,ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇచ్చింది.కంప్యూటర్ బేస్డ్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.అప్లై చేసుకునే అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.