Friday, September 20, 2024
spot_img

ప్రభుత్వం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికి ప్రయత్నిస్తుంది

Must Read
  • రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు
  • గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు
  • మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు
  • ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు
  • మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ అన్నారు.
శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ప్రారంభించారని తెలిపారు.నార్లాపూర్,ఏదుల,వట్టెంలలో 3 చొప్పున పంపులు సిద్దంగా ఉన్నాయని,దాదాపు 30 టీఎంసీల నీరు స్టోర్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫలప్రయత్నం అన్నారని కానీ ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొనివస్తున్నారని విమర్శించారు .కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ పాలన మీద విషం చిమ్మడానికే ప్రయత్నిస్తుందని ఆరోపించారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం మూలంగానే పాలమూరు నష్టపోయిందని కాంగ్రెస్ పార్టీ శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టుకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.కేసీఆర్ పాలమూరు,రంగారెడ్డి పనులను మొదలుపెడితే కేసులు ఎత్తిపోతల పనులను అడ్డుకున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసిందని విమర్శించారు.నాలుగు పంప్ హౌస్ లు,ఐదు రిజర్వాయర్లు బీఆర్ఎస్ పూర్తి చేసిందని వాటిని వినియోగించుకునే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.కేసీఆర్ హయాంలో దాదాపు 60 టీఎంసీల నీటి నిల్వకు పాలమూరులో రిజర్వాయర్లను సిద్దం చేశామని తెలిపారు.ఎనిమిది నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతలలో కనీసం తట్టెడు మట్టి ఎత్తలేదని మండిపడ్డారు.పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అమెరికా అందాలను చూసి ఆనందిస్తున్నారని ఎద్దేవా చేశారు.నీళ్ల కోసం పాలమూరు ఎంత తండ్లాడిందో,ఎన్ని జీవితాలను కోల్పోయిందో వీరికి తెలుసాని ప్రశ్నించారు.పాలమూరు బతుకులను మార్చేది వీరా అని నిలదీశారు. రోజుకు 30 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేస్తున్నారని ఆరోపించారు.మేడిగడ్డలో కెమెరా ఎగిరేశారని కేటీఆర్ మీద కేసు పెట్టారు, మరి తెలంగాణలో ఎగురుతున్న కెమెరాల మీద ఎన్ని కేసులు పెడతారని నిలదీశారు.తెలంగాణ విద్యార్థులు,రైతాంగం పైన సీఎం రేవంత్ రెడ్డి   కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారాని విమర్శించారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This