- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.,ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్ అని ఎద్దేవా చేశారు.ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని అన్నారు.తెలంగాణ రైతుల బతుకు ఆగమైపోతుందని ఆరోపించారు.దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎందుకింత వ్యవసాయ విధ్వంసం అయిందని ప్రశ్నించారు.రుణమాఫీ అంటూ మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగొట్టడం వల్లే తెలంగాణలోని రైతులకు ఈ అవస్థలు అని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ రూ.500 బోనస్ అని చెప్పి నిలువునా మోసం చేసిందని ఆరోపించారు.ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని విమర్శించారు.ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని అన్నారు.ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్,రిజర్వాయర్లను నింపే ప్రణాళిక,చెరువులను మళ్లించే తెలివి లేదని అన్నారు.బురద రాజకీయాలు చేయడం తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి లేదంటూ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.