- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో మరో రెండు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.గంటకు 30 నుండి 40 కిమీ గాలులు వేగంగా వీస్తాయని తెలిపింది.మరోవైపు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ అయింది.ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్,కరీంనగర్,ఖమ్మం,వరంగల్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కూరుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లో భారీ వర్షం :
సోమవారం సాయింత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహీల్స్,మదాపూర్,చాంద్రయణగుట్ట,కోఠి,దిల్సుఖ్నగర్,హబ్సిగూడ,ఉస్మానియా యూనివర్సిటీ,తార్నాకతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.సోమవారం కావడంతో భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.వర్షపు నీరు రోడ్ల పై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.