Friday, September 20, 2024
spot_img

రాశి ఫలలు

Must Read
  • ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ

మేష రాశి (Aries)

ఈ నెలలో విద్యా కార్యాచరణలో మంచి పురోగతి ఉంటుందని,కష్టానికి తగ్గ ఫలితాలు సాదించే అవకాశం ఉందని తెలిపారు ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ.వృత్తి రంగంలో కొత్త అవకాశాలు దొరుకుతాయని,ప్రతిభను చూపించేందుకు మంచి సమయమని పేర్కొన్నారు.మంచి క్రమ శిక్షణతో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారని,ఆత్మవిశ్వాసం చేసే పనుల వలన విజయాలను సాధిస్తారని వెల్లడించారు.

వివాహం:

వైవాహిక బంధంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని,భాగస్వామితో అర్థవంతమైన సంభాషణలు సాగిస్తారని తెలిపారు.

ఆరోగ్యం:

ఆరోగ్యం సాధారణంగా ఉంటుందని,నిద్ర మరియు ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని గమనిస్తారని తెలిపారు.ఒత్తిడిని తగ్గించేందుకు యోగ,లేదా మెడిటేషన్ చేయాలనీ సూచించారు.

వ్యాపారం:

వ్యాపారంలో మంచి లాభాలు సాధ్యమవుతాయని,కొత్త ఆలోచనలను అమలుచేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తారని తెలిపారు.

సంతానం:

సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తుకి సంభందించిన కార్యాచరణ పట్ల శ్రద్ధ వహిస్తారు.

పరిహారాలు:

శ్రీకృష్ణుడికి పళ్లతో పూజ చేయాలనీ, ఈ మేష రాశి వారు ప్రతిరోజూ సూర్య దేవుడికి నైవేద్యం సమర్పించడం మంచిదని అన్నారు.

వృషభ రాశి వారు :

విద్యా:

విద్యా రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవవచ్చని,పట్టుదల మరియు నిబద్ధతతో ముందుకు సాగడం అవసరమని సూచించారు.

వృత్తి:

వృత్తి విషయంలో నెమ్మదిగా ముందుకు వెళ్లడం మంచిదని,అభివృద్ధి స్థిరంగా వృద్ధి చెందుతుందని తెలిపారు.ప్రయత్నాన్ని తగ్గించకుండా కొనసాగించాలని తెలిపారు.

వివాహం:

వివాహ జీవితం సంతోషకరంగా ఉంటుంది.మీ భాగస్వామితో సానుకూల సంబంధాలు నిలుపుకోవడంలో మీరు సఫలీకృతులవుతారు.

ఆరోగ్యం:

ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహారపరమైన అలవాట్లు మార్చడం అవసరం.ఉదర సంభందిత సమస్యలకి ఆస్కారముంది.

వ్యాపారం:

వ్యాపారంలో మోస్తరు లాభాలు సాధ్యం. మీ భవిష్యత్ అంచనాలను అందుకోవడానికి మరికొంత సమయం అవసరమని మీరు తెలుసుకుంటారు.

సంతానం:

సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల విద్యపై శ్రద్ధ పెట్టండి.

పరిహారాలు:

శివలింగానికి పాలాభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి వారికి ప్రతి రోజు శివపూజ చేయడం మంచిది.

మిథున రాశి (Gemini)

విద్యా: ఈ నెలలో విద్యా రంగంలో మీరు మంచి ఫలితాలు పొందవచ్చును. కొత్త విషయాలను నేర్చుకోవడం సులభం గా మారుతుంది.

వృత్తి: వృత్తి సంబంధిత రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ సామర్ధ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సరియైన సమయం గా మీరు భావిస్తారు.

వివాహం: వైవాహిక బంధాల్లో ఆనందకర సమయాన్ని గడుపుతారు.
గతంలో ఏర్పడిన అపోహలు తొలగిపోతాయి.

ఆరోగ్యం: స్వల్ప ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు,ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం మరియు శ్రద్ధ అవసరం.

వ్యాపారం: వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగవచ్చు.

సంతానం: సంతానానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు

పరిహారాలు:
పార్వతీ దేవికి కుంకుమార్చన చేయించడం వలన శుభ ఫలితాలుంటాయి
మిథున రాశి వారు ప్రతిరోజూ విష్ణు మంత్రాన్ని జపించడం మంచిది.

కర్కాటక రాశి (Cancer)

విద్యా:విద్య విషయం లో మీ పురోగతి కొంత మందకొడిగా ఉంటుంది.కృషి పట్టుదల ద్వారా మాఆత్రమే ఆశించిన ఫలితాలను పొందగలరని మీరు గ్రహిస్తారు

వృత్తి: వృత్తిలో కొన్ని ఊహించని సవాళ్ళను మీరు అధిమించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

వివాహం :వైవాహిక బంధం సాధారణం గా ఉంటుంది.కొన్ని శుభకార్యాలు సంభవం

ఆరోగ్యం : ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరము

వ్యాపారం : వ్యాపారం లో ఆశాజనకమైన ఫలితాలు లేనికారణం చేత మీరు కొత్త మార్గాలకై ప్రయత్నిస్తారు

పరిహారాలు:కర్కాటక రాశి వారికి ప్రతిరోజూ కనకదుర్గానికి పూజ చేయడం మంచిది.

సింహ రాశి (Leo)

విద్యా: విద్యా రంగంలో మంచి పురోగతి మరియు విజయాలు ఉంటాయి. మీకు కావలసిన సహాయం మరియు విజయం లభించే అవకాశం ఉంది.

వృత్తి: వృత్తి రంగంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది.మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడతాయి.క్రొత్త గా వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల ఫలితాలుంటాయి.

ఆరోగ్యం: మంచి ఆరోగ్యం, కానీ మీ జీవనశైలిని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందని మీరు గ్రహిస్తారు.ఆహారం మరియు వ్యాయామం పై శ్రద్ధ వహించండి.

వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు సాధ్యమే. కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి.

సంతానం: సంతానానికి సంబంధించి మేలు జరుగుతుంది, పిల్లల విద్య మరియు ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి.

పరిహారాలు:
సూర్యుడికి 108 సూర్య నామాలను పఠించడం.
సింహ రాశి వారికి ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చెయ్యడం మంచిది.

కన్య రాశి (Virgo)

విద్యా: విద్యా రంగంలో స్థిరమైన పురోగతి ఉంటుంది.మంచి ఫలితాలు సాధిస్తారు.

వృత్తి: వృత్తి సంబంధిత రంగంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ అంతిమంగా విజయాన్ని సాధిస్తారు.

వివాహం: వివాహ జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో గతంలో ఏర్పడిన అపోహలు తొలగుతాయి.

ఆరోగ్యం: ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచి ఆహారం మరియు వ్యాయామం అవసరం గ్రహిస్తారు.

వ్యాపారం: వ్యాపారంలో నిరంతర అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలిస్తారు.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.ఒక శుభవార్త వింటారు.

పరిహారాలు:
లక్ష్మీ పూజ చేయడం.
కన్య రాశి వారికి ప్రతిరోజూ గణేష్ ఆరాధన చేయడం మంచిది.

తులా రాశి (Libra)

విద్యా: విద్యా రంగంలో కొన్ని విఘ్నాలు, కానీ పట్టుదలతో నెమ్మదిగా ప్రగతి సాధించవచ్చు.

వృత్తి: వృత్తి రంగంలో కొత్త అవకాశాలు పొందవచ్చు. మీ సామర్ధ్యాన్ని ప్రదర్శించదానికి ఇది సరైన సమయం

వివాహం:భాగస్వామితో కొన్ని స్పర్ధలొచ్చే అవకాశం ఉంది.వివాహ ప్రయత్నాలలో మీరు మరింత లోతుగా ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది.

ఆరోగ్యం:శిరో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు సక్రమ ఆహారం మరియు జీవనశైలిని కొనసాగించాలి.

వ్యాపారం:వ్యాపారం లో చాలా జాగ్రత్త అవసరం.నష్టాలు,మోసాలు ఉండే అవకాశం ఉంది.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.

పరిహారాలు:
శారదా దేవికి నైవేద్యాలు సమర్పించడం.
తులా రాశి వారు అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేయడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio)

విద్యా: విద్యా రంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ పట్టుదలతో మంచి ఫలితాలు సాధించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం సులభం గా మారుతుంది

వృత్తి: వృత్తి రంగంలో కొన్ని ఆటంకాలు ఉంటాయి, కానీ మీరు తెలివిగా మరియు ధైర్యంగా ఎదుర్కొంటారు.ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

వివాహం: వివాహ సంబంధాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.మీరు మీ భాగస్వామితో సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించగలుగుతారు.

ఆరోగ్యం: ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఒత్తిడి మరియు అనారోగ్యాన్ని నివారించడానికి ప్రశాంతం గా ఓపికతో ఉండాలని మీరు గ్రహిస్తారు.

వ్యాపారం: వ్యాపారంలో నూతన అవకాశాలు మరియు అభివృద్ధి.ఆశించిన ఫలితాలను పొందటం లో ఒత్తిడిని ఎదుర్కొంటారు.

సంతానం: సంతానానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు.కొన్ని సంఘటనలు మీ మనసును నొప్పిస్తాయి.

పరిహారాలు:
శివుడికి రుద్రాభిషేకం.శుభ ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius)

విద్యా: విద్యా రంగంలో అవరోధాలను అధిగమించాల్సిన పరిస్థితి ఉంటుంది.తీపి పాదార్ధాలను తినడం తగ్గించడం ద్వారా ఉపయోగం ఉంటుంది.

వృత్తి: వృత్తి రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు కొత్త ప్రతిపాదనలు అంగీకరించండి.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఆనందమైన సమయం గడుపుతారు.

ఆరోగ్యం: ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ స్వాస పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారం:దూర ప్రయాణాలు చేస్తారు.కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లు ఉంటుంది.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.కొన్ని ఆశ్చర్య కర సంఘటనలు మీకు ఆనందాన్నిస్తాయి.

పరిహారాలు:
ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి.
ధనుస్సు రాశి వారు ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయడం మంచిది.

మకర రాశి (Capricorn)

విద్యా: విద్యా రంగంలో మంచి పురోగతి ఉంటుంది. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు.విదేశీ విద్య కోసం ప్రయత్నిముచే వారు మీ ప్రయత్నాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది.

వృత్తి:వృత్తి విషయం లో కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.ప్రమోషన్స్ కొంతాకాలం వాయిదా పడవచ్చు.

వివాహం: వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.క్రొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వారు తమ సోల్మెట్ ను కలుసుకుంటారు.

ఆరోగ్యం:ఆరోగ్యం సుభిక్షం గా ఉంటుంది.ఉత్సాహభరితమైన కార్యాలలో పాల్గొంటారు.

వ్యాపారం:చాల జాగ్రత్త గా ఉండాల్సిన సమయం,భాగస్వాములు మిమ్మల్ని నష్టపరిచే అవకాశం ఉంది.

సంతానం: సంతానానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.అన్ని రకాల అభివృద్ధి కనపడుతుంది.

పరిహారాలు:
పరమేశ్వరునికి పాలాభిషేకం చేయించండి.
మకర రాశి వారికి ప్రతిరోజూ శివపూజ చేయడం మంచిది.

కుంభ రాశి (Aquarius)

విద్య: విద్యా రంగంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉత్సాహంగా ఉంటారు.

వృత్తి: వృత్తి రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి సమయం గా భావిస్తారు.

వివాహం:వైవాహిక జీవితం లో అనవసర అంశాల ప్రస్తావన వలన కలతలు వచ్చే అవకాశం ఉంది.నూతన వివాహ ప్రత్నాలు చేసే వారికి ఇది అనుకూల సమయం కాదు.

ఆరోగ్యం:శరీరం లో ట్రై గ్లిజరైడ్స్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది,సీనియర్ సిటిజన్స్ కి హృదయ సంభందిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారం: వ్యాపారంలో మంచి లాభాలు సాధ్యమే. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు.

సంతానం: సంతానానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పిల్లల ఆరోగ్యం మరియు విద్యపై శ్రద్ధ వహించండి.

పరిహారాలు:
తులసీ కవచం పఠించండి.
కుంభ రాశి వారు ప్రతిరోజూ గణేష్ పూజ చేయడం మంచిది.

మీనా రాశి (Pisces)

విద్యా:
విద్యా రంగంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. మీ కృషి మరియు పట్టుదల ద్వారా విజయాలు లభిస్తాయి.

వృత్తి:
వృత్తి విషయం లో అంత ఆశాజనకం గా ఉండకపోవచ్చు.పని చేసే ప్రాంగణం లో సహచరులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

వివాహం:
వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.నూతన వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈమాసం లో అనుకూల ఫలితాలు రాకపోవచ్చు.

ఆరోగ్యం:
ఆరోగ్యం చక్కగా ఉంటుంది.శారీరక దృఢత్వం పెంచుకోవడానికి నడక ప్రారంభించడం,జిమ్ లో చేరడం వంటివి చేస్తారు.

వ్యాపారం:మీరు బాగా కష్ట పడినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టడం లో కొంత వెనుకబడతారు.సహచరుల వలన కొంత అసౌకర్యాయానికి లోను అవుతారు.

సంతానం: సంతానానికి సంబంధించి అనుకూల పరిస్థితులు ఉంటాయి.పరీక్షలలో విజయాలను పొందుతారు.

పరిహారాలు:
ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ఎక్కించండి.
పచ్చని పేసర్ల తో చేసిన పిండి వంటలను నైవేద్యం గా నివేదించండి

శుభం భూయాత్ !!
సర్వేజనా సుఖినోభవంతు
నాగాభట్ల పవన్ కుమార్ శర్మ
ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు
యాచారం మండలం
మాల్ గ్రామం

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This