Friday, November 22, 2024
spot_img

ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్న హైడ్రా..

Must Read
  • కొనసాగుతున్న హైడ్రా దూకుడు..
  • చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా
  • శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు
    -సర్వే నంబర్‌ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత
  • తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం
  • పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు
  • ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన
  • గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు

నగరంలో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.వరసగా కూల్చివేతలు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రాయదుర్గం సర్వే నంబర్‌ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్‌ఎస్‌సీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణెళి లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు.నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిరదే ఆటగా, పాడిరదే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది.ఇటీవల సినీనటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈ లోపే అధికారులు దాన్ని నెలమట్టం చేశారు.మరోవైపు బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి చెందిన అనురాగ్‌ యూనివర్శిటీపై కూడా ఆరోపణలు వచ్చాయి.అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటూ ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు అధికార పార్టీ నేతలను సైతం హైడ్రా వదిలిపెట్టడం లేదు. ఇలా చిన్నా, పెద్ద తేడా లేకుండా హైడ్రా ఆక్రమణదారుల బెండు తీస్తోంది.

ఈ క్రమంలో హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్‌ సొసైటీ సపోర్ట్‌ వాక్‌ నిర్వహించింది.ఈ సపోర్ట్‌ వాక్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్‌ సిటిజన్స్‌ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు.హైదరాబాద్‌ లో అక్రమకట్టడాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.తమ కట్టడాలను కూడా కూల్చివేస్తారా? అని భయపడుతున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ తోపాటు పలువురి అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.దీంతో సోషల్‌ విూడియాలో హైడ్రా కూల్చివేతలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.చెరువులను కబ్జా పెట్టి నిర్మించారంటూ పలువురు.. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS