Friday, September 20, 2024
spot_img

అక్కగా నిన్ను పార్టీలోకి ఆశీర్వదించాను,నా మీద ఎందుకంత కక్ష

Must Read
  • అసెంబ్లీ సమావేశాలు,కొనసాగుతున్న మాటల యుద్దం
  • బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య వాడి-వేడి చర్చ
  • ఆవేదనకు గురైన సబితా ఇంద్రారెడ్డి
  • కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తా అని
    చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చారు
  • కాంగ్రెస్ లో రేవంత్ చెరినప్పుడు,ఒక అక్కగా ఆశీర్వదించను
  • ఇప్పుడు నా పై ఎందుకంత కక్ష

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం కొనసాగుతుంది.బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సభ ప్రారంభంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,సీఎం రేవంత్ రెడ్డి మధ్యల మాటల యుద్ధం కొనసాగింది.ఆ తర్వాత పార్టీ మార్పుల విషయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్య చర్చ జరిగింది.సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన తీసుకొనివచ్చారు.దీనికి బదులుగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుండి ఏ పార్టీకి మారారు..? తప్పకుండా పార్టీల మార్పు పై చర్చిస్తాం..కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే కాల్చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చరో చెప్పాలని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి చెరినప్పుడు ఈ రాష్ట్రానికి నువ్వు సీఎం అవుతావు..చాలా గొప్పగా ఎదుగుతావు అని చెప్పి ఒక అక్కగా ఆశీర్వదించాను..ఇప్పుడు నా మీద ఎందుకంత కక్ష తీర్చుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డికి నేనేం మోసం చేశాను..? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This