ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాల పై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా..?? కేవలం రాజకీయ కక్షలో భాగంగానే నా బిడ్డను జైలులో పెట్టారు.ఇంతకంటే ఇబ్బంది పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని గుర్తుచేశారు.నేను అగ్నిపర్వతంలా ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారు,కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని తెలిపారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని ప్రశ్నించారు.పార్టీ వదిలి వెళ్లిన ఎమ్మెల్యేల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.