యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల భరుచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ప్రమాదకరంగా మారింది.తోడేళ్లు చేసిన దాడిలో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 08 మంది మరణించారు.మరో 34 మంది గాయపడ్డారు.సోమవారం కూడా ఇదేళ్ల బాలికను తోడేలు గాయపరిచింది.దీంతో తోడేళ్ల బెడదను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.తోడేళ్ళు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.ఆఖరి ప్రయత్నంగా మాత్రమే దీనిని వినియోగించాలని అధికారులను ఆదేశించింది.మరోవైపు అటవీశాఖ అధికారులు,పోలీసులు కలిసి “ఆపరేషన్ భేడియా” నిర్వహించి ఇప్పటివరకు 04 తోడేళ్ళను పట్టుకున్నారు.