Saturday, November 23, 2024
spot_img

రాబోయే రోజుల్లో బీసీల జంగుసైరన్ మొగిస్తాం

Must Read
  • రాష్ట్రంలో సామాజిక న్యాయం,ప్రజాస్వామ్యన్ని కాపాడాలి
  • బీసీ డిక్లరేషన్,చట్టసభలలో బీసీల ప్రాధాన్యత కార్యచరణ చేపట్టాలి
  • టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‎ను కలిసిన టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్

ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ తెలిపారు.ఆదివారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‎ను కలిశారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 136 బీసీ కులాలు ఉన్నాయని,కానీ ఇప్పటివరకు దాదాపుగా 120 కులాలు అసెంబ్లీకి వెళ్లలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.77 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో ఒక్కసారి కూడా శాసనసభలో చోటుదక్కించుకొని కులాలు చాలా ఉన్నాయని అన్నారు.లక్ష జనాభా ఉన్న వాళ్ళు ప్రతిసారీ 07 శాతం ఎమ్మెల్యేలు అవుతుంటే 60 శాతం ఉన్న బీసీలు కనీస అర్హత పొందలేకపోతున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వమైన బీసీ ప్రాధాన్యతని పెంచే విధంగా అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో బీసీల జంగుసైరన్ మొగిస్తామని జంపాల రాజేష్ పేర్కొన్నారు.టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‎ని కలిసిన వారిలో సామాజిక ఉద్యమ నాయకులు రంగాషాయి బట్,ఉస్మానియా విద్యార్థి నాయకులు సోమేశ్,వెంకీ,గణేష్,టీఎస్ఎఫ్ కార్యవర్గ సభ్యులు,విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు.

తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) ప్రత్యేక అభినందనలు తెలిపిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ :

టీఎస్ఎఫ్ కి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.టీస్ఎఫ్ గత పది సంవత్సరాలుగా ఎటువంటి లాభపక్ష లేకుండా,నిస్వార్ధంగా విద్యార్థుల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చి వారి జీవితంలో ఉపాధి కల్పించేందుకు అందిస్తున్న తోడ్పాటును అభినందించారు.ఈ సంధర్బంగా టీఎస్ఎఫ్ అధ్యక్షులు జంపాల రాజేష్ ప్రశంసించారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS