- రేపే మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం
- రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడి
- వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం పంపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ బందోబస్తు
మూడోసారి దేశ ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రధానిగా నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించనున్నారు. మోడీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశ ప్రధానులకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది.ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని ఢిల్లీ చేరుకున్నారు.శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే,మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్,మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్,భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లకు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.వివిధ దేశల నుండి అతిథులు వస్తుండడంతో ఢిల్లీలోని ప్రముఖ హోటేల్స్ ను బుక్ చేసి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇప్పటికే రాష్ట్రపతి భవనం వద్ద టైట్ సెక్యూరిటీ ను ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత బలగాలు రంగంలోకి దిగాయి.