ఆజ్ కి బాత్
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో గీ..అక్రమాలు,స్కాములేంది సారూ..
ఫోన్ ట్యాపింగ్,గొర్రెల స్కామ్,ఛత్తీస్ గఢ్ నుండి కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటుర్రూ..
ఢల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసిన ఎందుకు సారు గమ్మున ఉన్నావు..??
వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది..! సావు నోట్లో తలకాయ పెట్టినా అంటివి.. తీరా చూస్తే అన్ని స్కాములలో మీ తలకాయే ఉన్నట్లు ఆరోపణలు రాబట్టే….!
మీరే కదా గతంలో ముఖ్యమంత్రి.. ఇన్ని అక్రమాలు జరిగిన మీకు తెలవకుండా జరిగాయా..?? అని మాకు కూడా అనుమానం రావట్టే..
గతంలో మీ గురించి పక్క రాష్ట్రంలో ఉండే మా దోస్తులకు చాలా గొప్పగా చెప్పుకున్న సారు..కానీ ఇలా మీ పాలనలో అక్రమాలు జరిగాయి అని ఆ..మా దోస్తులే చెప్తుంటే మా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు సారు..మిమ్మల్ని అభిమానించినందుకు మాకోచ్చిన ఫలితం గిదా సారు..ఛీ మా బ్రతుకు – ఓ అభిమాని ఆవేదన