Saturday, September 6, 2025
spot_img

ప్రభుత్వం పై బురద చల్లాడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు

Must Read

రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బురద చల్లాడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,అధికారం కోల్పోయిన మూడు నెలలకే జగన్ కు మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరుగుతే,ఈ హత్యల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మరణించారని తెలిపారు.కాని ప్రభుత్వం పై బురద చల్లాడానికి 36 రాజకీయ హత్యలు జరిగినట్టు జగన్ ఆరోపిస్తున్నారని వెల్లడించారు.జగన్ వద్ద నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని సమర్పించాలని అన్నారు.ఒకవేళ ఆధారాలు లేకుంటే జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం హయంలో వైసీపీ నాయకులకు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే వారిని తీవ్రంగా వేధించారని ఆరోపించారు.ఇప్పటికీ ఆ బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This