ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో తప్పులున్నాయని కవిత తరుపున న్యాయవాది వాదించారు.పిటిషన్ లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు.ఇద్దరి వాదనలు విన్న జడ్జి కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని ప్రశ్నించారు.కోర్టు ఆర్డర్ నమోదు కాలేదని కవిత తరపు న్యాయవాది తెలిపారు.దింతో తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా పడింది.