తిహార్ జైలు నుండి మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.కవిత తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి,ఈడీ తరుపున ఏఎస్ జి వాదనలు వినిపించారు.రెండువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.
కవితకు బెయిల్ మంజూరు కావడంతో,జైలు నుండి బయటికి వచ్చిన కవితను బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.కవిత మొదటిగా జైలు నుండి బయటికి రాగానే కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,తనను జైలులో పెట్టి ఐదున్నర నెలలు పిల్లలను దూరం చేశారని కన్నీళ్ళు పెట్టుకున్నారు.18 ఏళ్ల నుండి రాజకీయంలో ఉన్న తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాని తెలిపారు.ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు ఇబ్బందులకు గురిచేసిన వారిని వడ్డీతో సహ చెల్లిస్తానని,కేసీఆర్ బిడ్డను,తప్పు చేసే ప్రసక్తే లేదు తప్పు చేయకున్న జైలుకి పంపారు..అనవసరంగా తనను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.