- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
కవిత బెయిల్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ,బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ లభించిందని విమర్శించారు.కవితకు బెయిల్ వస్తుందన్న విషయాన్ని ముందే ఉహించమని పేర్కొన్నారు.మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ దెబ్బతీయాలని చూశారు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు ఢిల్లీలో బీజేపీ నాయకుల చుట్టూ తిరిగి ఆపద మొక్కులు మొక్కి కవితకు బెయిల్ లభించేలా ప్రయత్నించారని వ్యాఖ్యనించారు.కవిత బెయిల్ తో బీజేపీ,బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు.బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం ఒకటే మిగిలిందని తెలిపారు.
కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.కవిత తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి,ఈడీ తరుపున ఏఎస్ జి వాదనలు వినిపించారు.రెండువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.