Friday, September 20, 2024
spot_img

కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

Must Read
  • తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం
  • దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి
  • కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు..
  • ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో
  • ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా
  • ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా
  • ప్రతి అంశం లోను వెలమ సామాజికవర్గాందే ఆధిపత్యం
  • ఫోన్ టాపింగ్‌పై 2016లో హైకోర్టులో రిట్ దాఖ‌లు చేసిన ఫరాత్ ఇబ్రహీం
  • తాజాగా హోమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హైద‌రాబాద్ సీపీ, పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు

రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో అధికారులు విస్తుపోయే విధంగా ఫోన్ టాపింగ్ జరిగిందని, ముఖ్యంగా కేసీఆర్ దీనంతటికీ కీలక సూత్రధారి అనే విషయాన్ని దృవీక‌రిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ పైన మొద‌టి సారిగా 2016 లోని (డ‌బ్ల్యూపి నెం. 26579/2016) ఫరాత్ ఇబ్రహీం రిట్ దాఖ‌లు చేశారు. ఆనాడే రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ జరుగుతున్నట్టు గుర్తించిన ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయాన్ని పేడచెవిన పెట్టిన ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఆరోజు దీనిపై దృష్టి సారిస్తే టాపింగ్ వ్యవహారంలో ఇంత విధ్వంసం జరిగేది కాదని ఫరాత్ ఇబ్రహీం అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న ఈ వ్యవహారంతో కేసీఆర్‌కు ఉచ్చు బిగిస్తుందని అర్థమవుతుంది. అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తాను ఎవ్వరిని నమ్మకుండా ప్రతి ఒక్కరి పైన నిఘా పెట్టి ఫోన్ టాపింగ్ జరిపినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. జడ్జిలతో సహా ఎంతోమంది ప్రముఖ‌ మీడియా సంస్థ యజమానుల, తన సొంత పార్టీ నాయకులు, ప్రతిపక్షాలపై ఇష్టం వచ్చిన రీతిలో ఫోన్ టాపింగ్ జరిపినట్లు తెలుస్తోంది.

కేసు నీరు పోకుండా కఠిన సెక్షన్లు జోడించాలి : ఫరాత్ ఇబ్రహీం

రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరితోపాటు తన సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా పెట్టారని ఫరాత్ ఇబ్రహీం అన్నారు. స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐ బి) సంస్థ నెలకొల్పి అందులో తన సామాజిక వర్గాన్ని అధికారులుగా నియమించుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నాడనే అనుమానం గతంలోనే తనకు వచ్చిందన్నారు. దీనిపై 2016 సంవత్సరంలోనే హైకోర్టును ఆశ్రయించి రిట్ దాఖ‌లు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ ఫోన్ టాపింగ్ కు పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదలొద్దని వారిపై కఠినంగా సెక్షన్లు పెట్టాలని 7, 7ఎ, 8, 13 సెక్షన్స్ జోడించాలని ఆయన అన్నారు. దీనిపై తెలంగాణ స్టేట్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీకీ, హైదరాబాద్ కమిషనర్ కు, అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఉదాసిన ప్రదర్శించోద్దని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని దోషులకు శిక్ష పడే విధంగా చూడాలని అన్నారు. తన పదేళ్ల పాలనలో ప్రతి అంశం లోను సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేశాడని, దీంతో వారు వారి ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారు. ఏ రంగంలో తీసుకున్న అవినీతికి అడ్డు లేకుండా పోయింది. యథా రాజా తథా ప్రజా అన్న విధంగా పాలన కొనసాగింది. ప్రజలకు జవాబుదారితనంగా ఉండే ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరించింది.

అధికార మదంతో పలువురుపై కేసులు

కేసీఆర్, కేటీఆర్, నవీన్ రావు, ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వారితోపాటు మీడియా యజమానుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు,అనుమానం ఉన్న సొంత పార్టీ నాయకుల ఫోన్లను వదలని దుర్మార్గులు. టాపింగ్ నిందితులైన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావ్, రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న కలిసి ఎంతోమందిని వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్‌కు గురిచేసి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడ ఉన్నాయి. ఫోన్ టాపింగ్ బాధితుల కు న్యాయం జరగాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఇప్పుడు వారిపై పెట్టిన కేసులు కేసును నీరుగారిచే విధంగా ఉన్నాయని అందుకే మేము టాపింగ్ వ్యవహారంపై ఇలాంటి కేసులు ఉండాలని వెతికి మరి ఈ శిక్షలను బయటపెట్టామని ఇప్పుడు తాజాగా వారిపై ఈ సెక్షన్లు నమోదు చేసి శిక్ష పడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతున్న బయటకి రానివ్వ‌కుండా పకడ్బందీగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించాడు. టక్కు టమారా విద్యలతో ప్రజలను మబ్బపెట్టాడు. ఇంతటి దురాగతానికి ఒడిగట్టిన ఏ వ్యక్తిని కూడా వదలొద్దని ప్రభుత్వం కఠినంగా శిక్షపడేలా చర్యలు చేపట్టాలని లేదంటే కోర్టు ద్వారా తెలుసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This