Thursday, December 12, 2024
spot_img

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం..

Must Read
  • ప్ర‌జా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
  • ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా మార్పులు స‌రికాదు
  • కాంగ్రెస్‌పై మండిపడ్డ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌
  • ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటి
  • అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం
  • స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు.

రైతుబంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని..నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కార్‌ వైఖరిని ఎండగతామన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు.

కేసీఆర్ ఫాంహౌస్ కి మాజీ మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్‌ నేతలు వెంకట్ రాంరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, శంబిపూర్ రాజు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS