- ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
- కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది
- ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే
- మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది
గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుందని వ్యాఖ్యనించారు.ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని,యాదవులు,మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించిందని విమర్శించారు.కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించలేదు.మేము ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేశామని కేసీఆర్ పేర్కొన్నారు.గొర్రెల పంపిణీ పథకం,దళితబంధు, రైతు భరోసా పథకాలకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేదని, రైతులను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.