Friday, September 20, 2024
spot_img

అవినీతి నుండి తప్పుకునేందుకు కాంగ్రెస్ కి కేసీఆర్ సపోర్ట్

Must Read
  • కేంద్రమంత్రి బండిసంజయ్

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్ అణచివేస్తుందని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలాంటి రక్షణ లేకుండా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీని సొంత పార్టీ నేతలే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదని ఎద్దేవా చేశారు.త్వరలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని తెలిపారు.తమ పార్టీ కార్యకర్తల గెలుపే తమ లక్ష్యమని వెల్లడించారు.ఎన్నికల్లో సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో రాష్ట్ర ప్రజలు మోసపోయారని అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This