- మంత్రి సీతక్క
అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను చెల్లించిందని భట్టి విక్రమార్క తెలిపారు.బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుందని వ్యాఖ్యనించారు.ఏ ఒక్క వర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని,యాదవులు,మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించిందని విమర్శించారు.కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించలేదు.మేము ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేశామని కేసీఆర్ పేర్కొన్నారు.గొర్రెల పంపిణీ పథకం,దళితబంధు, రైతు భరోసా పథకాలకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేదని, రైతులను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
కేసీఆర్ చేసిన విమర్శలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడతారా,కేంద్ర చేసిన ద్రోహంపై నిన్న అసెంబ్లీలో మాట్లాడితే, కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.బిజెపి మెప్పు కోసమే బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నారని,ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు.