లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.ఫిబ్రవరి 23న అరెస్టైన అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని ధిబ్రుగఢ్ జైలులో ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖాదుర్ సాహిబ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.దింతో కోర్టు లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.ఢిల్లీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని, ఎలాంటి మీడియా ప్రకటనలు ఇవ్వొద్దు అని తెలిపింది.దింతో ఢిల్లీ వచ్చిన అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.