Friday, September 20, 2024
spot_img

యువ నాయకత్వానికి కీలకం కానున్న కేటిఆర్

Must Read

కల్వకుంట్ల తారకరామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాజీ మున్సిపల్, పరిశ్రమలు, పట్టణ అభివృద్ధి, సమాచార సాంకేతిక అభివృద్ధి శాఖ (ఐటీ) మంత్రిగా హుందా తో తన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వివిధ సంస్థల నుంచి ప్రశంసలతో పాటు అవార్డులు రివార్డులు సాధించిన ఘనత కేటీఆర్ ది ప్రస్తుతం ఐటీ రంగంలో సమర్థవంతమైన నాయకుడు కేటిఆర్ అని ఐటీ ఉద్యోగులు గుర్తుకు తెచ్చుకుంటున్న సందర్భాలు అక్కడక్కడ చూస్తున్నే ఉన్నాం వారు ఆశించే విధంగానే ప్రజలలో నిరంతరము ఉండి వారి సమస్యల పరిష్కారానికై పోరాడుతూ మళ్లీ అధికారంలోకి వచ్చి యువత ఆశించించిన విధంగా శాస్త్ర సాంకేతికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతూ ఐటీ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రాగామీగా నిలుపాలని కేటిఆర్ నిరంతరము అంటున్నారు. యువ నాయకుడిగా నేటి యువకులకు మార్గ నిర్దేశకులుగానే కాకుండా భారత నూతన ఒరవడిలో దిన దిన అభివృద్ధి చెందుతూ ఖండాంతరాలు దాటుతూ కేటీఆర్ పేరు ప్రపంచ నలుమూలల వినబడుతుంది అంటే అతని నిబందత కఠోరా శ్రమ అతని విజయానికి నిదర్శనం. కేటీఆర్ 1976 జూలై 24 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభ దంపతులకు కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో జన్మించాడు అతని పుట్టుక తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా సేవ కార్యక్రమాలు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. కేటీఆర్ కూడా ఎల్లవేళల ప్రజా శ్రేయస్సుకు ఆరాటపడే వ్యక్తి. కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడిగా నిరంతర విద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఓర్పు, సహనంతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికై నిరంతరము శ్రమిస్తూ ప్రజా నాయకుడిగా అన్న అంటే స్పందించే మంచి మనస్సున్న మషిగా హంగు ఆర్భాటము లేకుండా సాధారణంగా జీవిస్తూ ఎక్కడ నెగ్గలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా తనకు అప్పగించిన భాధ్యతలపైనే దృష్టి సాధిస్తూ లక్ష్య సాధనకై అడుగులు వేస్తూ ఎన్నిక ఏదైనా గెలుపు దిశగా పయనిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎన్నో విజయాలను అందించిన ఘనత కేటీఆర్ ది. ఆలోచనలో దార్శనికత నిర్ణయాలో పరిపక్వత మాటలో సూటీదనం చర్చలో మేధావి తనం వంటి లక్షణాలను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తూ యుూత్ కి ఒక ఐ కాన్ గా నిలిచాడు కేటిఆర్. రాజకీయాల్లో అసమన ప్రతిభతో మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. తెలంగాణ ప్రజలందరు ప్రేమగా రామన్న అని పిలుచుకుంటారు. కేటీఆర్ కు ఆటు పోటులు కొత్తేం కాదు తను మొదట ఎంచుకున్న సాప్ట్ వేర్ రంగంలో దిన దిన అభివృద్ధి చెందుతూ ప్రముఖ ఐ ఎన్ టి ఎ కంపేనిలో ప్రాజెక్టు మేనేజర్ గా పని చేశాడు తదనంతరం తెలంగాణ ఉద్యమంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కేసిఆర్ ఆదేశాల మేరకు రొడ్డుపైకి వచ్చి తెలంగాణ వచ్చే వరకు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా శ్రేయస్సుకై కృషి చేస్తున్నాడు. కేసిఆర్ ఏ భాధ్యలు అప్పగించిన సమర్థవంతంగా నిర్వర్తిస్తూ విజయ దుందుభి మొగించిన ఘనత కేటిఆర్ ది. ఆనాడు అధికారంలో ఉన్న ప్రజల కోసం పని చేశాడు నేడు ప్రతి పక్షములో ఉన్న ప్రజల సమస్యల కోసం ప్రజ పక్షమున పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ప్రధాన భూమిక పోషించిన కేటిఆర్ అభివృద్ధి లో తన పాత్రను అడుగడుగునా ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పరిపాలనలో నేడు ప్రతిపక్షములో తనదైన శైలిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేకను సృష్టించుకున్నాడు. తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ నేడు నిరుద్యోగుల తరపున కోట్లాడుతున్నాడు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాటి నుండి గెలుపు ఓటములను స్వాగతిస్తూ గ్రామ స్థాయి కార్యకర్తలను సైతం ఉత్తేజ పరుస్తూ పార్టీని ముందుకు తీసుకు పోతున్నాడు. నాయకుల మధ్య విబేధాలు వచ్చిన అందరిని సమన్వయ పరుస్తూ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ తెలంగాణ నలుములల గులాబీ జెండా ఎగిరే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరిని భాగస్వామ్యం చేస్తూ మాది గులాబీ జెండా అని గౌరవంగా చెప్పుకునే విధంగా కేసిఆర్ అధ్యక్షతన కేటిఆర్ సారథ్యంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉండే విధంగా కార్యకర్తలకు నాయకులకు దిశ నిర్దేశం చేస్తున్నాడు. రాజకీయ, ఆర్థిక,సామాజికంగా వెనుకబడిన తెలంగాణ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది తెలంగాణ అంటే దాంట్లో కేటిఆర్ పాత్ర ముఖ్యమైనది. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు కేటీఆర్ వారసత్వ రాజకీయం కాకుండా ప్రజల నుంచి ప్రజల కోసం నేడు రాజకీయం చేస్తున్నాడు సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై దేశంలోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. చేనేత రంగాన్నికి ప్రపంచ వ్యాప్తతంగా పేరు తెచ్చిన ఘనత కేటీఆర్ కే దక్కుతుంది. కేటీఆర్ రాజకీయ రంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో విశేషమైన గుర్తింపు పొందారు ప్రపంచ పారిశ్రామిక వేత్తలు అబ్బుర పడే విధంగా తనకు ఉన్న ప్రావీణ్యన్ని ప్రదర్శిస్తూ ఔరా అనే విధంగా గతంలో తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకు వచ్చాడు. యావత్ దేశం కేటిఆర్ వైపు చూస్తుంది అంటే అతీశేయోక్తి కాదు. ఐటీ రంగంలో కేటిఆర్ తెలియని వారు లేరు. ఆనాటి కేంద్ర మంత్రులు నేడు అధికార పార్టీ నాయకులు సైతం వ్యక్తిగతంగా ప్రసంశించిన సందర్భాలు చూశాం. టీ హబ్ ద్వారా ఎంతో మంది విద్యార్థుల పరిజ్ఞానాన్ని వెలికి తీసి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికై కృషి చేసి అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులు కల్పిస్తూ ఐటీ హబ్ గా మార్చడానికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాని ఒప్పించి మెప్పించి యువత ఎదుగుదలకై కృషి చేశాడు. కేటిఆర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడే ఆయన తన మాటల ద్వారా జనాలను ఆకట్టుకునే శక్తి ఉంది అదే కాకుండా జాతీయ మీడియాలో స్పష్టముగా మాట్లాడే నైపుణ్యం ఉంది. జాతీయ ప్రముఖ పత్రికలు కూడా కేటీఆర్ గురించి రాశాయి ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అమెరికా మాజీ అధ్యక్షుడు సైతం కేటీఆర్ ను అభినందిచడం జరిగింది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వౕనాలు అందాయి అంటే కేటీఆర్ కు పారిశ్రామిక రంగం పైన ఎంత పట్టు ఉందో మనం అర్థం అవుతుంది. గత ప్రభుత్వంలో విదేశాల్లో ఉన్న ఎన్ ఆర్ ఐ లతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని కోరాడు. తన చిరునవ్వుతో ప్రేమ అప్యాయతలు పంచుతూ ఆపద సమయంలో నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు. అధికార పార్టీ నాయకులను సైతం తన రాజకీయ వ్యూహాలతో అయోమయానికి గురి చేసే సమర్థుడు కేటిఆర్ రాజకీయ ప్రత్యర్థుల ఉహౕకు సైతం అందకుండా వ్యూహౕ రచనతో ముందుకు పోతాడు. తన తండ్రి నుండి నాయకత్వ లక్షణాలను పునికి పుచ్చుకున్న కేటీఆర్ నవ తరం రాజకీయాలకు అద్దం పడుతుంది. అధికారంలో ఉన్న లేకున్నా నేటికి నిరంతరము సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా సహాయము ఆర్జించిన వారికి నేను ఉన్నాను అంటూ మానవత్వ దృక్పథంతో వారి సమస్యలను పరిష్కరిస్తూ ఎందరో పేద విద్యార్థులకు విద్య వైద్య సహాయానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాడు. ప్రతి ఏటా తన పుట్టిన రోజుకు సేవా కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ పేద ప్రజల అభ్యున్నతికి నిర్విరామ కృషి చేస్తున్న కేటిఆర్ కు ప్రజల ఆదర అభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కొరుకుంటూ భవిష్యత్తు యువ తరాన్నికి కేటీఆర్ ఆదర్శం కావాలని ఆశిదాం.

  మిద్దె సురేష్
 కవి, వ్యాస కర్త
 9701209355
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This