Friday, September 20, 2024
spot_img

కేటీఆర్ కు జైలు తప్పదు

Must Read
  • ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు
  • అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు
  • నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే
  • బీఆర్ఎస్ పని అయిపోయింది
  • బీఆర్‌ఎస్‌ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు
  • కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు

మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం మీడియాతో మాట్లాడిన అయిన మాజీ మంత్రి కేటీఆర్ కి జైలు తప్పదని జోష్యం చెప్పారు.అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసని వ్యాఖ్యనించారు.గత కొన్ని రోజులుగా వస్తున్న బిజెపి,బిఆర్‌ఎస్‌ విలీనం వార్తలను ఈ సంధర్బంగా బండిసంజయ్ కొట్టి పారేశారు.తనతోపాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను,నాయకులను కేటీఆర్ జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించరని,వాటిని ఇంకా నేను మర్చిపోలేదని పేర్కొన్నారు.బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందని అన్నారు.బీఆర్‌ఎస్‌ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి ఫేక్‌ న్యూస్‌ అని స్పస్టం చేశారు.బీఆర్‌ఎస్‌ ఓ ఔట్‌ డేటెడ్‌ పార్టీ అని,కవిత బెయిల్‌ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.సిసోడియాకు బెయిల్‌ వస్తే బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..?అంటూ ప్రశ్నించారు.కోర్టు అంశాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు.రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే ఐపీఎస్‌ లకు ఇప్పటికీ పోస్టింగ్‌ ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు.బిఆర్‌ఎస్‌ పార్టీకి కొమ్ముకాసిన ఐఏఎస్‌ లకే మళ్లీ పోస్టింగులు ఇస్తునారని ఆరోపించారు.బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ పాలనకు మధ్య పెద్ద తేడా ఏవిూ లేదని,అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌,బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ,జడ్పీటీసీలే మా బ్రాండ్‌ అంబాసిడర్లని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సోదరుడి కోసమే అమెరికా వెళ్లారనటం సరికాదని వెల్లడించారు.రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు.కాంగ్రెస్‌ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని,అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది వాళ్ల పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.అసదుద్దీన్‌ ఓవైసీ ఎన్ని వక్ఫ్‌ బోర్డు భూములను కాపాడారో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.గతంలో వక్ఫ్‌ బోర్డు భూములను కాంగ్రెస్‌,ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని విమర్శించారు.సవరణ బిల్లు ఆమోదం పొందితే అన్ని విషయాలు బయటికి వస్తాయని వివరించారు.వక్ఫ్‌ బోర్డు భూములను ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు.వక్ఫ్‌ బోర్డు భూములను కాంగ్రెస్‌,ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని.. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే… వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు.బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఎవరనేది జాతీయ అధ్యక్షుడు నడ్డా డిసైడ్‌ చేస్తారని అన్నారు.అధినాయకత్వం నిర్ణయమే పార్టీకి శిరోధార్యమని చెప్పారు.కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయని,ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదని స్పష్టం చేశారు.హైకమాండ్‌ ఎవర్నిబీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే వారి నేతృత్వంలో పని చేస్తామని స్పస్టం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This