వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02 లక్షలు,గాయపడ్డ వారికి రూ.50 వేలు చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు సుమారుగా 88 మంది మరణించారని,తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.తాజా ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం జులై 30,31న రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించి,ప్రభుత్వ కార్యక్రమాలను వాయిదా వేసుకుంది.