సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్ను కలుస్తామని, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని అన్నారు. అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు గౌరవ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వెంటనే ఇవ్వాలని తెలిపారు. ఆశా వర్కర్ల డిమాండ్లపై అసెంబ్లీలో కొట్లాడుతాం అని అన్నారు.