- రెండు ప్రధాన హిందూ పండుగలను విస్మరించి లా ‘ పరీక్షలు నిర్వహిస్తున్న ఓయు
- పండుగల రోజు పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేసింది
- ఆగస్టు 16, 19 తేదీల్లో రానున్న వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలను విస్మరించి పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేసిన ఓయు పరీక్ష విభాగం
- పరీక్ష తేదీలు మార్చాలని తల్లిదండ్రుల అభ్యర్ధన
ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన అనుబంధ కళాశాలల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఓయు పరీక్ష కంట్రోలర్ (CoE)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియు పరీక్షల షెడ్యూల్‌పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు ప్రధాన హిందూ పండుగలు ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం మరియు ఆగస్టు 19న రాఖీ,పండుగలను విస్మరించబడ్డాయని మండిపడుతున్నారు.పరీక్షలకు షెడ్యూల్ ను ముందు వెనక ఆలోచించకుండా ఇష్టమొచ్చిన రీతిలో తేదీలు ఖరారు చేశారనీ, ఓయు కు చెందిన వివిధ అనుబంధ కళాశాలల న్యాయ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఓయు పరీక్షా బోర్డును తప్పుబడుతున్నారు.
విశ్వవిద్యాలయం నిర్వహించే అన్ని పరీక్షలకు ఒక క్రమబద్ధమైన పద్ధతిని అనుసరించాలని కోరుతున్నారు.ఇది పండుగలు మరియు పరీక్షల మధ్య ఘర్షనలా పడకూడదని, ప్రస్తుతం తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పరీక్షా బోర్డ్‌ను రీషెడ్యూల్ చేయమని అభ్యర్థిస్తున్నారు.లా’ విద్యార్థి తల్లితండ్రులలో ఒకరైన శ్రీమతి గీతాశర్మ మాట్లాడుతూ,ఈ దశలో తాము ఎలాంటి బలవంతపు వ్యూహాలకు పాల్పడకూడదనీ నిర్ణయించుకున్నామని, తమ అభ్యర్థన పరిగణనలోకి తీసుకునేందుకు విశ్వవిద్యాలయ అధికారులకు సహేతుకమైన అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే తల్లిదండ్రులు మరియు విద్యార్థుల అభ్యర్థనను విస్మరించి బేఖాతరు చేస్తే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు.