- రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం
- ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా
- రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి
- కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలనీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్,హరీష్ రావు డిమాండ్ చేశారు.కేటీఆర్,హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ ను నేను అంగీకరిస్తూన్న,జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు నేను సిద్ధం,ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే,ప్రభుత్వాధినేతగా నేను వస్తా అని రేవంత్ రెడ్డి తెలిపారు.రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి,మీరే తేదీ నిర్ణయించండి దీక్షకు మేము సిద్ధం అని అన్నారు.తెలంగాణకు నిధులు తెచ్చుడో,సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు.