ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు ఇచ్చింది.దింతో జులై 12 వరకు కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరోవైపు కేజ్రీవాల్ ని విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ బిజెపి కేంద్ర కార్యాలయం ముందు పెద్ద ఎత్తున్న నిరసన చేపట్టారు.బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.