Friday, September 20, 2024
spot_img

మెడ్ ప్లస్ మెగా మోసం

Must Read
  • అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్
  • సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ
  • మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్
  • రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైస‌లకు విక్రయం
  • 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ ద‌గా
  • కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైస‌లకు తగ్గించిన సంస్థ
  • అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్
  • చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్

దగ్గు, సర్ది, జ్వరం వచ్చిందంటే చాలు టకీమని దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్, ఫార్మసిల‌కు వెళ్లి మందులు తెచ్చుకుంటారు. ఇదీవరకు లాగా చిన్న రోగానికే ఆర్ఎంపీ, డాక్టర్ వద్దకు పోవుడు మానేశిర్రు జనాలు. పెద్ద కంపెనీలుగా పేరుపొందిన పలానా మెడికల్ షాపుకు వెళ్తే వ్యాధి చెబితే మందులు ఇచ్చేస్తారు అనే నమ్మకంతో అంతా అక్కడికి వెళ్లీ తెచ్చుకుంటారు. అయితే ఆ దుక్నంలో ఏ మందు ఇచ్చారూ.. దానిపై ఎమ్మార్పీ రేటు ఎంత, ఎక్స్ ఫైరీ డేట్ ఉందా, లేదా అనే చూసే ఓపిక లేదు చాలా మందికి. గుడ్డిగా వాళ్లు ఇచ్చిన ట్యాబ్లెట్ తీసుకొని ఇంటికొచ్చి వేసుకోవడం అలవాటైంది. ఇదే అదనుగా తీసుకొని మెడ్ ప్లస్… డ్రగ్స్ ను ఇష్టారీతిన అమ్ముతున్నారు. మెడికల్ దందా చేసే కంపెనీలన్నీ ఓ మాఫియాగా ఏర్పడి పేదోడి జేబులకు ఛిల్లులు పెడుతున్నారు. ఎమ్మార్పీలు సైతం వాళ్ల నోటికొచ్చిందే రాసుకుంటారు. ఇంతా జరుగుతున్నా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ నిద్రమత్తులో ఉండడం గమనార్హం.!

ఆఫర్ల పేరుతో మెగా మోసం :
‘కొండ నాలుకకు మందెస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు’ మెడికల్ దందా చేస్తున్న కంపెనీలు ఒకే ఫార్మూలాతో డిఫరెంట్ రేట్లకు విక్రయిస్తూ జనాల్ని పిచ్చొళ్లను చేస్తున్నారు. చైన్ ఫార్మసిల ద్వారా 50 నుండి 80 శాతం భారీ డిస్కౌంట్ పేరుతో అమాయకులను నిండా ముంచుతున్నారు. మెడ్ ప్లస్, దందా చేసే మరికొన్ని కంపెనీలు జలగల్లా ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. మాయలఫకీర్ మాటలు చెబుతూ సామాన్యులను నిండా ముంచుతూ కోట్లు గడిస్తున్నాయి. ప్రజలకు విక్రయిస్తున్న మందుల నాణ్యత ప్రమాణాలు తనిఖీలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్ అండ్ కాస్మోటిక్ చట్టం 1940, రూల్స్ 1945 65(2),(4),(9) ను కచ్చితంగా అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెబుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్ నుండి తెలంగాణకు వచ్చిన కోట్లాది రూపాయలు విలువైన న‌కిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో డ్రగ్ అండ్ కాస్మోటిక్ చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. చైన్ ఫార్మసీలు మందులను తగ్గింపు అమ్మకాలతో రాష్ట్ర ప్రజలు, ఔషధ వినియోగదారులు గందర గోళానికి గురవుతున్నారు. ఒకవైపు చేంజ్ ఫార్మసీలు ఔషధాలను తగ్గింపు ధరలకు విక్రయిస్తూ కొన్ని ఇతర ఔషధాలపై (ఎన్.పి.పి.ఏ) నిబంధనలను తుంగలతోక్కి అధిక ధరలకు మందులను విక్రయిస్తున్నా పట్టంచుకునే నాధుడే కరువయ్యాడు.

ట్యాబ్లెట్స్ పై ఇష్టారీతిన ఎమ్మార్పీలు :

మెడ్ ప్లస్ లో కొన్ని మెడిసిన్ ను సొంతంగా తయారు చేసినట్టుగా సరికొత్తగా ప్యాకేజింగ్ చేసుకొని వాటిపై ఇష్టారీతిగా ఎమ్మార్పీ రేట్లు వేసుకొని సేల్ చేస్తుండడం విశేషం. ఉదాహరణకు షుగర్ వ్యాదికి సంబంధించిన సీతా ఓడీ 50ఎంజీ (సిటాగ్లిప్టిన్ ట్య‌బ్లెట్ ఐపీ)

అనే ఓ ట్యాబ్లెట్ సాధారణంగా మార్కెట్ వ్యాల్యూ రూ.88లు. కానీ దానిని ఎమ్మార్పీ రూ. 378.50 పైస‌లుగా (సిటాగ్లిప్టిన్ ట్య‌బ్లెట్ ఐపీ – 50ఎంజీ, బ్యాచ్ నెం. 23ఎస్‌1జిటిఏ112, త‌యారీ తేది జ‌న‌వ‌రి 2023, ఎక్స‌పైరీ తేది డిసెంబ‌ర్‌ 2024) ఫ్రింట్ చేసి సామాన్య ప్రజలను మోసం చేస్తుంది ఆ సంస్థ. మెడిసిన్స్ ను అధిక ధరలకు విక్రయిస్తూ పేద ప్రజల జేబులకు ఛిల్లులు పెడ్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో సదరు సీతా ఓడీ 50ఎంజీ ట్యాబ్లెట్ (బ్యాచ్ నెం. 23ఎస్‌1జిటిబి330, త‌యారీ తేది న‌వంబ‌ర్ 2023, ఎక్స‌పైరీ తేది అక్టోబ‌ర్ 2025) ధరను రూ.96.30 పైస‌లకు తగ్గించింది మెడ్ ప్లస్. ఇలా చూసుకుంటూపోతే ఎన్ని మందులపై దోపిడీ జరుగుతుందో పరీక్షిస్తేగానీ మెడ్ ప్లస్ మోసంలో ఉన్న అసలు మతలబ్ తెల్వదు. అధిక ధరలకు మెడిసిన్ సేల్ చేసే కంపెనీలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు ఎక్కువ రేట్లకు అమ్మడం ద్వారా సంపాదించిన డబ్బును తిరిగి రికవరీ చేయాలనే డిమాండ్ వస్తోంది.

లక్షలాది మందులు అమ్ముడుపాయె :

సీతా ఓడీ 50ఎంజీ పేరుతో రూ.378.50 పైస‌లు ఫ్రింట్ చేసి లక్షలాది మందులను సేల్ చేసిన మెడ్ ప్లస్ కోట్లు కూడగట్టింది. అయితే ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డ మెడ్ ప్లస్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబ్ ఏంటో అర్థం కావడంలేదు. దొంగతనం చేసిన మనిషి అప్పుడు పట్టుబడిన డబ్బు లేదా బంగారం ఇస్తే వదిలిపెడతారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సదరు కంపెనీ పేదలను నిండా ముంచి ఎన్నో మందులను అమ్ముకొని కోట్లు సంపాదిస్తే వారిపై చర్యలు తీసుకోకుండా ఎమ్మార్పీ రేట్లు మార్చి అమ్మితే లైట్ తీసుకొని వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చైన్ ఫార్మసీలు అమలు చేస్తున్న ఔషధ విక్రయాల చట్ట విరుద్ధమైన మార్కెటింగ్ వ్యూహాన్ని ఆపడానికి డి.సి.ఏ వెంటనే తగిన కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు కోరుతున్నారు. అదేవిధంగా మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్ లిమిటెడ్ చేసిన మోసంపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొని, అక్ర‌మంగా అధిక ధ‌ర‌ల‌తో అమాయ‌క ప్ర‌జ‌ల నుండి వ‌సూలు చేసిన మొత్తాన్ని రీక‌వ‌రీ చేయాల‌ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్ లిమిటెడ్ చేస్తున్న మ‌రిన్ని అరాచ‌కాల‌ను మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం అవినీతిపై అస్త్రం…

ఇదే విష‌యంపై మెడ్‌ప్ల‌స్ హెల్త్ స‌ర్వీసెస్ లిమిటెడ్ సంస్థను ఈమెయిల్ ద్వారా వివ‌ర‌ణ కోర‌డం జ‌రిగింది. వారి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన స‌మాధానం రాలేదు…

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This