ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్ తగిలింది.బుధవారంతో కవిత కస్టడీ ముగిసిపోవడంతో అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.వాదనలు విన్న కోర్టు జ్యూడీషియల్ కస్టడీను జులై 25 వరకు పొడిగించింది.తదుపరి విచారణ జులై 25కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు.అప్పటి నుండి బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కవితకి ఊరట మాత్రం లభించడం లేదు.మరోవైపు ఇప్పట్లో కవిత జైలు నుండి బయటికి వచ్చే అవకాశం లేదనే తెలుస్తుంది.ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో కవితను ఉంచారు.ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులైన కేటీఆర్,హరీష్ రావు,సబితా ఇంద్రా రెడ్డి కవితతో ములకత్ అయిన విషయం తెలిసిందే.