- సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కోసం అయిన ముంబయి వెళ్లారు. ఈ సంధర్బంగా పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రధాని మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని మోదీ అన్నారు.. ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో రైతులకు రూ.02 లక్షల రుణాలు మాఫీ చేశామని, 22 లక్షల మంది రైతులకు రూ.17,829 కోట్లు రుణామాఫీ చేశామని తెలిపారు. 10 నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహారాష్ట్రలో రైతు సంక్షేమాన్ని మారిచాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 ప్రాజెక్టులు గుజరాత్ రాష్ట్రానికి వెళ్లాయని, ప్రజలను మోసం చేసిన భాజపాను మహారాష్ట్రలో ఓడించాలని అన్నారు.