ప్రధాని మంత్రి పదవికి నరేంద్ర మోడి రాజీనామా చేశారు.లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది.ఈ సంధర్బంగా రాష్ట్రపతి ద్రౌపది మూర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానల్లో విజయం సాధించింది.దీంతో రాష్ట్రప్రతి మూర్మును మోడి తన మంత్రిమండలితో కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలిని రాష్ట్రపతి ఈ సంధర్బంగా కోరారు.జూన్ 8న మూడోసారి మోడి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ ఎన్నికల్లో 400 సీట్లను టార్గెట్ చేసిన ఎన్డీఏకు నిరాశే మిగిలింది.కేవలం 293 స్థానాలకే పరిమితం అయింది.17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రపతిని కలిసి కేబినెట్ నిర్ణయాన్ని రాష్ట్రపతికి అందించారు నరేంద్ర మోడి.17వ లోక్‌సభ రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు.