విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డా.మోహన్ బాబు మాట్లాడుతూ, కన్నప్ప ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసతో నిర్మించాం. భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజు గారితో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు గారు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్‌లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’అని అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ :కన్నప్పను ప్రతీ ఒక్క ఆడియెన్ భుజానికి ఎత్తుకుని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి వస్తున్న సపోర్ట్‌ని చూస్తూనే ఉన్నాను.అందుకే వాళ్లలోంచి కొంత మందిని ఇక్కడకు పిలిచాను.2014లో కన్నప్ప జర్నీ ప్రారంభమైంది. 2015లో నేను కన్నప్పని డెవలప్ చేస్తూ వెళ్తుంటే, తణికెళ్ల భరణి గారు పూర్తిగా నాకే అప్పగించారు. నా దైవం, నా తండ్రి మోహన్ బాబు గారు, విన్ని, వినయ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కన్నప్పను తెరపైకి తీసుకు రాగలిగాను. టీం సెట్ కాలేదు కానీ.. లొకేషన్ల కోసం వేట ప్రారంభించాను. శివుడు పర్మిషన్ ఇస్తే తీయడానికి రెడీగా ఉండాలనే అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. గత ఏడాది ఆ శివుడు పర్మిషన్ ఇచ్చారు. మేం సినిమాను తీశాం. ఆయన ఆశీస్సుల వల్లే సినిమాను తీయగలిగాం. కన్నప్ప మైథాలజీ కాదు.. కన్నప్ప మన చరిత్ర. కట్టు కథ అంటే నమ్మకండి.. రెండో శతాబ్దంలో జరిగిన కథ. చోళ రాజుల టైంలో జరిగింది. ఏడో శతాబ్దంలోనూ కన్నప్ప గురించి శంకరాచార్యులవారు చెప్పారు. 14వ శతాబ్దంలో నాయనార్ల గురించి ధూర్జటి రాశారు. అందులో 9వ నాయనార్ కన్నప్ప.18వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లు ఇంగ్లీష్‌లో ప్రింట్ చేశారు. బికనీర్ యూనివర్సిటీలో ఆ పుస్తకం చూశాం. ఆ పుస్తకాన్ని చదివి.. ఎంతో జాగ్రత్తగా తీసి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాం. కన్నప్ప నా బిడ్డలాంటిది. ఈ కన్నప్ప కోసం ఇంత మంది ఆర్టిస్టులని ఎందుకు తీసుకున్నామనేది సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపై ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇది నా వర్షెన్‌లో రాసుకున్న ‘కన్నప్ప’. అందుకే వరల్డ్ ఆఫ్ కన్నప్ప అని అందరినీ ఆహ్వానించాం. నేను రెండో శతాబ్దం కథను చెబుతున్నాను. దానికి తగ్గట్టుగా ఉండాలనే న్యూజిలాండ్ లొకేషన్‌లో సినిమాను తీశాం. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తున్నామని ముందుకు వెళ్లాం. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ కన్నప్ప మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. హర హర మహదేవ్’ అని అన్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘కన్నప్ప సినిమాలో నాకు నా ఆర్టిస్టులే బలం. విష్ణు చేసిన యాక్టింగ్, పడిన కష్టం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. గడ్డ కట్ట చలిలోనూ టీం అంతా చలించకుండా పని చేసింది. విష్ణు గారు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అంత డెడికేటెడ్‌గా పని చేశారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. నా అంచనాలని మించి నటించారు. రామాయణం, మహాభారతం మైథాలజీ కాదు.. అది మన చరిత్ర. సౌత్, నార్త్ అని ఉండదు. ఓ భక్తుడి కథను చెప్పాం. మనం దేవుడి దగ్గరకు వెళ్లి కోరికలు కోరుతాం. కానీ ఏం కోరకుండా దేవుడికే నేత్రాలను సమర్పించారు కన్నప్ప. అలాంటి గొప్ప భక్తుడి కథను చెప్పాం. అంతకంటే గొప్ప కథ ఇంకెక్కడ దొరుకుతుంది’ అని అన్నారు.
శరత్ కుమార్ మాట్లాడుతూ ‘కన్నప్ప కేవలం సినిమా కాదు.. మన చరిత్ర. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారు. ఇంకా ఇప్పటికీ ఆ పాత్రల్లోనే ఉండిపోయాం. చరిత్రను అందరూ మర్చిపోతున్నారు. మనం మన చరిత్రను చెప్పుకోవాలి. కన్నప్పను అందరూ వీక్షించాలి’ అని అన్నారు.
మధుబాల మాట్లాడుతూ ‘కన్నప్ప లాంటి ప్రాజెక్ట్‌లో నటించడం ఆనందంగా, గర్వంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్. విష్ణు మంచు గారికి మేకింగ్‌లో ఎంతో నాలెడ్జ్ ఉంది. విష్ణు లాంటి వారే ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ని తీయగలరు. ఓ మహాయజ్ఞంలో పాల్గొన్నట్టుగా అనిపించింది’ అని అన్నారు.
ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ ‘కన్నప్పలో నాకు ఛాన్స్ ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి, ముఖేష్ సింగ్ గారికి థాంక్స్. ఈ సినిమాకు అందరూ ప్రాణం పెట్టి నటించారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.