- డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు ఉపాధ్యక్షురాలు కమల హారిస్.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తన పేరును ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడం కోసం శాయశక్తుల కృషి చేస్తానని,ఎట్టి పరిస్థితిలో ఎన్నికల్లో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.బైడెన్ గొప్ప నాయకుడని కొనియాడారు.మరోవైపు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం ప్రకటించారు.