Thursday, November 21, 2024
spot_img

డ్యూటీకి.. డుమ్మా సాల‌రీ ఫుల్‌…

Must Read

(రెండు నెలలుగా తిప్ప‌ర్తి పీహెచ్‌సీలో విధులు నిర్వ‌ర్తించ‌ని భాగ్య‌ల‌క్ష్మి)

  • ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్, పజ్జూర్ సబ్ సెంటర్ లో ఏఎన్ఎం నిర్వాహకం
  • మెడికల్ లీవ్, క్యాజువల్ లీవ్ నో మెన్షన్
  • ఇన్ ఛార్జ్ రాజేష్, యూడీసీ అనిల్ తో లోపాయికారి ఒప్పందం
  • యధావిధిగా రెండు నెల‌ల జీతం తీసుకున్న వైనం
  • హెచ్‌డిఎఫ్ నిధులు దుర్వినియోగం చేసిన డా.రాజేష్, అనిల్

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఇంకేంటి చాలామంది దర్జాగా ఉంటారు. నౌకరుకు పోయినా,పోకున్నా పర్లేదులే అన్న నిర్లక్ష్యం వహిస్తారు.జాబ్ వచ్చే వరకు ఎంత కష్టపడతారో ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బే ఏం ఉందిలే నౌకరు అన్నంత ఈజీగా తీసుకుంటారు. అదే కోవకు చెందినది ఏఎన్ఎం భాగ్యలక్ష్మీ. న‌ల్గొండ జిల్లా తిప్ప‌ర్తి గ్రామం & మండ‌లం ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ లోని ప‌జ్జూర్‌ స‌బ్ సెంట‌ర్ లో ఏఎన్ఎంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నది భాగ్య ల‌క్ష్మి. ఈమె గ‌త మూడు సంవ‌త్స‌రాలు క్రితం డిప్యూటేష‌న్‌పై వెలిదండ పిహెచ్‌సికి వెళ్ళింది. ఆ త‌ర్వాత నూత‌నంగా ఏర్ప‌డ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో డిప్యూటేష‌న్ ర‌ద్దు కావ‌డంతో తిరిగి తిప్ప‌ర్తి ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌కు వచ్చింది. విధుల్లోకి వ‌చ్చిన కూడా రెండు నెల‌లు నుండి డ్యూటీకి హాజ‌రు కాకుండా అటెండెన్స్ రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు లేకున్న జీతానికి ఏం ఇబ్బంది కాలేదు. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ ఇన్‌చార్జ్ డా. రాజేష్ (ప్ర‌స్త‌తం బ‌దిలీ కావ‌డం జ‌రిగింది),యూడీసీ అనిల్ ఇద్ద‌రు కలిసి ఏఎన్ఎం భాగ్య‌ల‌క్ష్మితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగిని విధుల‌కు రాకున్న కూడా రెండు నెల‌ల నుంచి జీతం ఇప్పించారు. అన్ని రోజులు నౌకరుకు రాకున్నా రిజిస్టర్ లో ఏమి మెన్షన్ చేసి లేదు. మెడిక‌ల్ లీవ్ లో ఉన్నా అది రిజిస్ట‌ర్‌లో ఎంట్రీ చేయాలి. ఏ కార‌ణం ఉన్నా కానీ రిజిస్ట‌ర్ లో న‌మోదు చేయాలి. కానీ,రిజిస్ట‌ర్ ప‌రిశీలించ‌గా అక్క‌డ ఎలాంటి విష‌యం న‌మోదు లేక‌పోవ‌డం అనుమానాలకు తావిస్తుంది. అనుకూల‌మైన వారికి ఒక‌ర‌కంగా, అనుకూలంగా లేని వారికి ఓ ర‌కంగా జీతాలు ఇవ్వ‌డం జ‌రిగిందని ఉద్యోగ‌స్తులు ఆరోపిస్తున్నారు..

పీహెచ్‌సి లో వీరు ఇద్ద‌రు చెప్పిందే వేదం:

ఈ పీహెచ్‌సీలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ ఇన్‌చార్జ్ డా. రాజేష్, యూడీసీ అనిల్ ఇద్దరు చెప్పినట్టే నడుస్తది. వీళ్లు చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రతి ఒక్కరూ అదే ఫాలో అవుతారని సమాచారం. అయితే డా.రాజేష్, అనిల్ ఇద్దరూ కలిసి ఎన్నో అవినీతి, అక్రమాలకు కూడా పాల్పడ్డారని తెలుస్తోంది. హాస్పిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫండ్ నిధులు దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.వాస్తవంగా ఎన్.క్యూఏఎస్ నిధుల‌ను నాణ్య‌త ప్ర‌మాణాలు పెంపొందించేందుకు మెరుగుప‌ర్చాలి. కానీ హాస్పిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ సోసైటికి వ‌చ్చిన నిధుల‌ను… ఇన్‌చార్జ్ అయిన రాజేష్, అనిల్ వాటిని దారి మ‌ళ్లించారు. అట్టి నిధులను బోగ‌స్ బిల్లులు పెట్టి లక్షల రూపాయల నిధులు స్వాహా చేసిన‌ట్లు వినిపిస్తోంది. ఇంతా జరుగుతున్నా ఎంపీపీకి స‌మాచారం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అతి త‌క్కువ స‌మ‌యంలో ఇన్‌చార్జ్ గా ఉండి రాజేష్, అనిల్ అవినితీ కార్యక్ర‌మాల‌కు పాల్ప‌డడం శోచ‌నీయం.

ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి విధులపట్ల నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలి. డ్యూటీకి రాకుండా జీతం తీసుకున్న ఏఎన్ఎం, హెచ్‌డిఎఫ్ నిధులు దుర్వినియోగం చేయడమే గాక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ డా.రాజేష్, యూడీసీ అనిల్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS