Friday, September 20, 2024
spot_img

ప్రభుత్వ భూమా,అయితే డోంట్ కేర్

Must Read

(స‌ర్కార్ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతున్న శేరిలింగంప‌ల్లి ఎమ్మార్వో నిర్ల‌క్ష్యం)

  • కేశవ్‌ నగర్‌లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు
  • ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు
  • సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్‌
  • రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల కుమ్ముక్కు
  • నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లో
    ఒక్క అంశ‌మాత్ర‌మే…
  • కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవడంలో విఫ‌లం
  • భూముల‌ను ర‌క్షించ‌ని ఎమ్మార్వోపై చ‌ర్య‌లు తీసుకోవాలి – స్థానికులు

తెలంగాణలో ప్రభుత్వ భూములను కబ్జా చేసుడు అంటే అంత ఈజీ. రియల్టర్లు, బిల్డర్లు తలచుకుంటే గవర్నమెంట్ లో కానీ పనులు ఏవీ లేవని తాజా పరిణామాలు చూస్తుంటే అందుకు అద్దం పడుతున్నాయి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాష్ట్రంలో ఎక్కడా ఖాళీ జాగ ఉంటే వెంటనే అక్కడ వాలిపోయే వారు అక్రమార్కులు. అసెన్డ్ ల్యాండ్స్, పేదల భూములపై కన్నుపడితే చాలు వాటిని వెంటనే కబ్జా చేసుడే వాళ్ల పని. వెంటనే తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆ జాగలో భారీ నిర్మాణాలు చేపట్టుడు వారికి వెన్నతోపెట్టిన విద్య. గులాబీ నేతలు, మంత్రులు, గవర్నమెంట్ పెద్దల సపోర్ట్ తో ఇదంతా సాగేది. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. పాలకులు మారిన అధికారులు వాళ్లే ఉన్నారు కదా అనే టాక్ వినిపిస్తోంది. వాళ్లు అటు ఇటు ట్రాన్స్ ఫర్ అయినప్పటికి ఇప్పుడున్న వారితో కూడా సంబంధాలు కొనసాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే గోపన్ పల్లిలో సర్కార్ భూమిని కబ్జాదారులు కొట్టేసి దానిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రెవెన్యూ, ప్రభుత్వ సిబ్బంది మౌనంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పక్కనే ఐటి కారిడార్‌ పరిధిలో ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు రియల్‌ గద్దల పాలవ్వడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే,రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కేశవ్ నగర్ లో సర్వేనెం. 37లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. అంతేకాదు ఆ స్థలంలో బిల్డర్లు భారీ బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణం చేపడుతున్నారు. ప్రభుత్వ భూమిలో జీరో పర్మిషన్‌తో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసి, స్థానిక తహసీల్దారు కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతుండడం గమనార్హం. గోపన్‌ పల్లి గ్రామ శివారు పరిధిలోని సర్వే నెంబర్‌ 37లో 378 ఎక‌రాల 17 గుంట‌లు ప్రభుత్వ భూమి ఉంది. 1999లో ఈ సర్వే నంబర్‌లోని భూమి నుంచే అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాంబే (వాల్మీకి అంబేద్కర్‌ ఆవాస్‌ యోజన) స్కీమ్‌ కింద కొంత ల్యాండ్‌ ను పేదలకు కేటాయించి.. ఆ స్థలాల్లో ఇండ్లను కట్టించింది. అయితే ఈ ఇళ్లు నిర్మించేందుకు వచ్చిన కూలీలు ఇక్కడే అప్పట్లో గుడిసెలు వేసుకుని ఉన్నారు. కానీ వీళ్లకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి పట్టాలు మంజూరు కాలేదు. అయినప్పటికిని తర్వాత కాలంలో వీరు.. గుడిసెల స్థానంలో రేకుల షెడ్డులు నిర్మించుకున్నారు. అయితే సర్వే నంబర్‌ 37 లో వీళ్లకు ప్రభుత్వం భూమి ఇవ్వనప్పటికి అక్రమంగా ఉంటున్నారనే కారణంతో.. 2018 ఆగ‌స్టులో అప్ప‌టి తహశీల్దార్‌, ఆర్డీవో చంద్ర‌క‌ళ భారీ పోలీస్ బందోబ‌స్తుతో రేకుల షెడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అక్రమంగా కబ్జా ఉంటున్న వారి నుంచి రెవెన్యూ అధికారులకు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడంతో అప్పట్లో వెనుదిరిగిపోయారు.

గోపన్‌ పల్లిలోని సర్వే నెంబర్‌ 37లో 378.17 ఎక‌రాల భూమిలో అక్ర‌మ‌ నిర్మాణాల‌కు స్థానిక ఎమ్మెల్యే అరిక‌పూడి గాంధీ, అతని అనుచరులు సపోర్ట్ గా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ భూమిని ప్లాట్ల వారిగా విభ‌జించి 40-60 లెక్క‌న బాగాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా.. సర్వే నంబర్‌ 37లో రేకుల షెడ్డులు వేసుకుని నివాసం ఉంటున్న వారిపై బిల్డర్ల కన్ను పడింది. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తులకు పదో పరకో ముట్టజెప్పి ఆ భూమిని లాగేకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వ భూమిలో బిల్డర్స్‌ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూమి కబ్జా చేసుకొని ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు తీసుకోకుండానే బిల్డర్స్‌ నిర్మాణాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలకు పూనుకున్న బిల్డర్స్‌ గత శేరిలింగంపల్లి తహశీల్దారు ఆఫీస్‌ సిబ్బందికి మాముళ్లు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అధికారులు ఇచ్చిన అండతోనే బిల్డర్స్‌ ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరికి రాజకీయ నాయకుల అండదండలు బిల్డర్స్‌ కు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తొంది. స్థానిక ఎమ్మెల్యే ప్ర‌జ‌ల సంక్షేమానికి ఉప‌యోగ‌ప‌డే ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గుర‌వుతుంటే ప్రేక్షక‌పాత్ర వ‌హించ‌డం వెనుక ప‌లు అనుమానాలు వ‌స్తున్న‌ట్లు ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.. పాల‌కులే ప్ర‌భుత్వ భూమిని కాపాడ‌కుంటే.. మ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని భూముల‌కు, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ క‌ల్పిస్తారు..

నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లో స‌ర్వే నెంబ‌ర్ 37 ఒక్క‌టి మాత్ర‌మే పాఠ‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.. వీరిద్ద‌రు క‌లిసి చేసిన అనేక అవినీతి బాగోతాలు మ‌రో క‌థ‌నంలో వివ‌రిస్తాం…

75 గజాల్లో భారీ బిల్డింగ్స్ నిర్మాణం:

ఎదైనా బిల్డింగ్ కు పర్మిషన్ ఇవ్వాలంటే గవర్నమెంట్ సవాలక్ష నిబంధనలు పెడుతుంది. కానీ ఇక్కడ నిర్మాణం చేపడుతున్న బహుళ అంతస్తులకు బిల్డర్స్ కనీస నిబంధనలు పాటించకపోవడం విడ్డూరంగా ఉంది. సాధారణంగా ఏదైనా అపార్ట్మెంట్‌ లేదా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలంటే పెద్ద స్థలం ఉండాలి. కానీ, ఇక్కడా మాత్రం కేవలం 75 గజాల స్థలంలోనే ఆరేడు ఫ్లోర్స్‌ ను బిల్డర్స్‌ నిర్మించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ వైపు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా బిల్డింగ్స్‌ నిర్మాణాలు చేపట్టడం.. అది 75 గజాల స్థలంలోనే భారీగా అక్రమ బిల్డింగ్స్‌ ను నిర్మించడం ప్రభుత్వ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం వెనుకు ఆంతర్యాంటో అర్థం కావడంలేదు. బిల్డర్స్‌ గత శేరిలింగంపల్లి తహసీల్దారు వంశీమోహ‌న్, అధికారుల సపోర్ట్ బాగా ఉందని అర్థమవుతోంది. మరోవైపు శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వ భూమిని బ‌రితెగించి రియాల‌ర్ట్‌లు య‌దేచ్ఛగా క‌బ్జా చేసి, ఎలాంటి నిర్మాణ అనుమ‌తులు లేకుండా బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు చేప‌డుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ ప్ర‌భుత్వ భూమిని కాపాడ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌డానికి కార‌ణాలు ఏంటనే అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్యక్రాంత‌మైన ప్ర‌భుత్వ భూమి వ్య‌వ‌హారాలు స‌రిదిద్దుకునేందుకే ఆయన అధికార పార్టీలో చేరాడనే స‌ర్వ‌త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెం.37లోని ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి భారీ భవన నిర్మాణాలు చేప‌డుతున్న క‌బ్జాదారుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అందుకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This