Friday, November 22, 2024
spot_img

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనమైపోయిన ఆశ్చర్యపోవాల్సిన లేదు

Must Read
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది
  • కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు.
  • మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు
  • కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రోకర్లకు కమిషన్ ఇచ్చి,మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు తెచ్చే కుట్ర చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం అధిక వడ్డీలు తెస్తే రాష్ట్ర ప్రజల పై భారం పడుతుందని,ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు.
కేసీఆర్ బాటలోనే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారని,నీతి ఆయోగ్ మీటింగ్ కి రేవంత్ రెడ్డి హాజరుకాకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను బలోపేతం చేయడమే నీతి ఆయోగ్ లక్ష్యమని,మొహం చెల్లకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ కి హాజరుకాలేదని అన్నారు.అసెంబ్లీలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు కలిశాయని,దాంట్లో భాగంగానే బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS